Jio Postpaid Plans Netflix: జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మార్కెట్‌లోకి వచ్చాకా..వేరే కంపెనీలకు చెందిన అన్ని పెయిడ్ ప్లాన్‌లో మార్పులు వచ్చాయి. జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్ విషయానికొస్తే ఇది చాలా తక్కువ ధరలోని లభించడమేకాకుండా ఎక్కువ ప్రయోజనాలను అందించే విధంగా ఉంటుంది. అందుకే జియో ప్లాన్‌లను రిచార్జ్ చేసుకోవడానికి వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ప్రస్తుతం మార్కెట్‌లో కస్టమర్‌లను ఆకర్షించే చాలా రకాల ప్లాన్‌లున్నాయి. ఇందులో కొన్ని ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్ సంబంధించినవి కూడా ఉన్నాయి. అయితే మీరు పోస్ట్‌పెయిడ్ ప్లాన్ పొందడమేకాకుండా OTT సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా పొందొచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇదే అతి చౌకైన ప్లాన్:
ఇప్పుడు మీకు తెలియజేసే ప్లాన్ అతి చౌకైనది. మీరు ఈ ప్లాన్ ప్రకారం..రూ. 399 పెట్టి రిచార్జ్ చేయిస్తే..నెలా పాటు 75GB డేటా పొందొచ్చు. అంతేకాకుండా అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 SMSలు కూడా పొందొచ్చు. ఈ ప్లాన్‌లో ఒక సంవత్సరం పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌తో పాటు డిస్నీ + హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు.
Also Read: Rajinikanth Balakrishna : బాలకృష్ణను రజినీకాంత్ ట్రోల్ చేశాడా?.. ఆ మాటలకు అర్థం అదేనా?
రూ. 599 ప్లాన్ ప్రయోజనాలు:
ఈ ప్లాన్‌లో మీరు 100GB డేటా ఇంటర్నెట్, ప్రతి రోజు 100 SMS, అపరిమిత వాయిస్ కాలింగ్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా మీరు పై ప్లాన్‌లో పొందిన ఓటీటీ(OTT) ప్లార్ట్ ఫామ్ సబ్‌స్క్రిప్షన్ లభించే అవకాశాలున్నాయి.
రూ.799 గల పోస్ట్‌పెయిడ్ ప్లాన్:
ఈ ప్లాన్ మీరు 150GB డేటా నుంచి 200GB రోల్‌ఓవర్ డేటా పొందొచ్చు. రెండు సిమ్ కార్డుల్లో ఏదైనా నెట్‌వర్క్‌లో అన్ లిమిటెడ్ కాలింగ్, అన్ లిమిటెడ్ ఎస్‌ఎమ్‌ఎస్ సౌకర్యం లభిస్తుంది. ఇక ఓటీటీ ప్లార్ట్ ఫామ్ సబ్‌స్క్రిప్షన్ విషయానికొస్తే..డిస్నీ + హాట్‌స్టార్‌తో పాటు, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ పొందొచ్చు.
అత్యంత ఖరీదైనది ప్లాన్ ఇదే:
రూ. 1,000 గల పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 200GB హై స్పీడ్ డేటా, 500GB రోల్‌ఓవర్ డేటాను పొందొచ్చు. అంతేకాకుండా ఇందులో రెండు నుంచి మూడు సిమ్‌లకు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు ఎస్‌ఎమ్‌ఎస్ సౌకర్యం కూడా లభిస్తుంది. అంతేకాకుండా సంవత్సరం పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్‌స్టార్ పొందొచ్చు.
Also Read: Rajinikanth Balakrishna : బాలకృష్ణను రజినీకాంత్ ట్రోల్ చేశాడా?.. ఆ మాటలకు అర్థం అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook