Moto G34 5G Sales: నూతన సంవత్సరం 2024లో మోటోరోలా అందిస్తున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్ Moto G34 5G. ఆకర్షణీయమైన లుక్, అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరకు లభ్యం కానుండటం విశేషం. మీరు కూడా తక్కువ ధరకు బ్రాండెడ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కావాలనుకుంటుంటే ఇదే మంచి ఛాయిస్ కాగలదు.
Moto G34 5G ఇ కామర్స్ అధికారిక పార్ట్‌నర్ ఫ్లిప్‌కార్ట్. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ కూడా ప్రారంభం కానుంది. జనవరి 14 నుంచి జనవరి 19 వరకూ ఆరు రోజులపాటు ఈ సేల్ ఉంటుంది. ఇప్పుడు మోటోరోలా లాంచ్ చేసిన సరికొత్త స్మార్ట్‌ఫోన్ Moto G34 5G విక్రయాలు కూడా ఫ్లిప్‌కార్ట్‌లో జనవరి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 9వ తేదీన మోటోరోలా కంపెనీ ఇండియాలో కొత్త 5జి స్మార్ట్‌ఫోన్ Moto G34 5Gపేరుతో లాంచ్ చేసింది. ఇందులో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 5 హోల్ డిస్‌ప్లే ఉంటుంది. Moto G34 5Gలో స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం ఉంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ప్రత్యేకత. కెమేరాపరంగా చూస్తే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరాతో పాటు డ్యూయల్ కెమేరా సెటప్ ఉంటుంది.
Moto G34 5G ధర, ఇతర ఫీచర్లు
Moto G34 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు వేరియంట్లలో Moto G34 5G స్మార్ట్‌ఫోన్ 4 జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ధర కేవలం 9,999 రూపాయలు మాత్రమే. ఇక 8జీబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అయితే కేవలం 11,999 రూపాయలు మాత్రమే. ఎక్స్చేంజ్ ఆఫర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ మరో వేయి రూపాయలు తక్కువకే పొందవచ్చు. అంటే కేవలం 10,999 రూపాయలకే తీసుకోవచ్చు.
Moto G34 5G కెమేరా
Moto G34 5G స్మార్ట్‌ఫోన్‌లో రెండు కెమేరాలున్నాయి. మొదటిది 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా కాగా రెండవది 2 మెగాపిక్సెల్ కెమేరా. రెండు కెమేరాలతో పాటు ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న 128 జీబీ స్టోరేజ్‌ను 1 టీబీ వరకూ పెంచుకోవచ్చు. ఇందులో డ్యూయల్ సిమ్ సెటప్ ఉంది. రెండూ నానో సిమ్ కార్డులు అమర్చుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. అప్‌డేటెడ్ ఆండ్రాయిడ్ 15, మూడేళ్ల వరకూ సెక్యూరిటీ కల్పించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.5 ఇంచెస్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉండటంతో స్క్రీన్ సరికొత్తగా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రస్తుతం గరిష్టంగా 8 జీబీ ర్యామ్ ఇచ్చారు. దీనిని 16 జీబీ వరకూ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ కూడా ఏకంగా 5000 ఎంఏహెచ్ ఉంటుంది. ఇందులో 20 వాట్స్ టర్బోపవర్ ఛార్జింగ్ ఉండటం వల్ల ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. 5జి, వైఫై, బ్లూటూత్, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్ సపోర్ట్ చేస్తాయి. ఇక సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ కూడా ఉన్నాయి.
Also read: FD Rate Hike: ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు భారీగా పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook