Poco M6 5G Launch Date In India: ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది దీనిని దృష్టిలో పెట్టుకొని టెక్ కంపెనీలు కొత్త కొత్త మొబైల్స్ ను లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా సాధారణ బడ్జెట్లో లభించే స్మార్ట్ ఫోన్ల తయారీకే కంపెనీలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. అయితే చాలా వరకు యువత ప్రీమియం ఫీచర్స్ కలిగిన అతి తక్కువ ధరలో లభించే మొబైల్స్ ను మాత్రమే కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనికి అనుగుణంగానే కంపెనీలు కూడా స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో రూ 10,000లోపు లభించే మొబైల్స్‌కి భారీ డిమాండ్ ఉంది. అయితే పోకో కంపెనీ కూడా ఈ బడ్జెట్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని మార్కెట్లోకి మరో మొబైల్‌ను లాంచ్ చేయబోతోంది.
ప్రముఖ టెక్ కంపెనీ పోకో అతి తక్కువ ధరలోని 5జి స్మార్ట్ ఫోన్ కస్టమర్స్ కి అందించబోతోంది. మరికొన్ని రోజుల్లోనే POCO M6 5G సిరీస్ మార్కెట్లోకి విడుదల కాబోతోంది. అయితే కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన అధికారిక సమాచారాన్ని కూడా ఇటీవలే వెల్లడించింది. పోకో అందించిన వివరాల ప్రకారం..భారత మార్కెట్లో డిసెంబర్ 22వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ ధర, ఇతర వివరాలను కూడా పేర్కొంది. అయితే పోకో విడుదల చేయబోయి ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలే ప్రముఖ టెక్ కంపెనీ పోకో ఈ POCO M6 5G మొబైల్ విడుదలకు ముందే టీజర్‌ను లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. పోకో కమ్యూనిటీలో ఈ టీజర్‌కు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. భారత్‌లో విడుదల కాబోయే POCO M6 5G స్మార్ట్ ఫోన్ ధర రూ.9,500 కంటే తక్కువగా ఉండబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ మొబైల్ పై బ్యాంక్ ఆఫర్స్ కూడా అందించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాంక్ ఆఫర్స్ అన్ని పోను ఈ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ మరింత తగ్గింపుతో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 22వ తేదీన పోకో అధికారిక వెబ్సైట్‌తో పాటు ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో లభించబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మొబైల్‌ను మొదట కంపెనీ ఓరియన్ బ్లూ, గెలాక్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
POCO M6 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్:
✾ 6.79-అంగుళాల LCD డిస్‌ప్లే
✾ HD ప్లస్ రిజల్యూషన్
✾ 90Hz రిఫ్రెష్ రేట్
✾ 600 nits పీక్ బ్రైట్‌నెస్
✾ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
✾ MediaTek Dimensity 6100+ ప్రాసెసర్
✾ ఇంటిగ్రేటెడ్ Mali G57 GPU
✾ 128GB/256GB స్టోరేజ్ ఆప్షన్స్
✾ MIUI 14
✾ 5000 mAh బ్యాటరీ
✾ 18W ఫాస్ట్ ఛార్జింగ్
✾ USB టైప్-C పోర్ట్ ఛార్జింగ్
✾ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
✾ ఫేస్ అన్‌లాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook