Oppo Reno 8T 5G Price: ఒప్పో నుంచి అదిరిపోయే మరో మొబైల్..శక్తివంతమైన ఫీచర్స్‌తో మీ ముందుకు..

Oppo Reno 8T 5G Price: ఒప్పో టెక్ బ్రాండ్ అతి త్వరలోనే మార్కెట్‌లోకి ఒప్పో రేనో సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన అధికారిక సమాచారం ఇప్పటికే కంపెనీ విడుదల చేసింది. ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jan 16, 2024, 10:14 AM IST
Oppo Reno 8T 5G Price: ఒప్పో నుంచి అదిరిపోయే మరో మొబైల్..శక్తివంతమైన ఫీచర్స్‌తో మీ ముందుకు..

Oppo Reno 8T 5G Price: మార్కెట్లో స్మార్ట్ ఫోన్‌లకు పెరుగుతున్న డిమాండ్‌లను దృష్టిలో పెట్టుకొని కంపెనీలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 5G మొబైల్స్‌తో లాంచ్ చేస్తున్నాయి. ఇందులో చాలావరకు కంపెనీలు ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే విడుదల చేస్తున్నాయి. అయితే ఇటీవలే ఒప్పో తమ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను సిరీస్ రేనో విడుదల చేసింది. 5G టెక్నాలజీతో కూడిన Oppo Reno 8T 5G స్మార్ట్‌ఫోన్ ను కంపెనీ లాంచ్ చేసింది. 

ఈ మొబైల్ అతి శక్తివంతమైన 108 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా కొత్త టెక్నాలజీతో కూడిన కెమెరాను ఇందులో అందించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇవే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌లో అనేక రకాల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మొబైల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అతి తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం బిల్ట్ క్వాలిటీ కలిగిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనే వారు తప్పకుండా ఈ Oppo Reno 8T 5G మొబైల్‌ను కొనుగోలు చేయవచ్చని కొందరు టిప్ స్టర్స్ తెలుపుతున్నారు. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ బడ్జెట్‌లో అతి శక్తివంతమైన కెమెరాతో అందుబాటులో ఉంది. ఇవే కాకుండా ఎక్కువసేపు వినియోగించేందుకు ఈ ఫోన్‌లో ఒప్పో ఎక్కువ రోజుల పాటు లైఫ్ను అందించే బ్యాటరీని కూడా అందిస్తోంది. దీంతోపాటు అనేక రకాల టెక్నాలజీతో కూడిన స్పెసిఫికేషన్లను కూడా కంపెనీ అందుబాటులో ఉంచింది.

Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..

ధరకు సంబంధించిన పూర్తి వివరాలు:
Oppo Reno 8T 5G స్మార్ట్‌ఫోన్ ధర సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు టిప్ స్టర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 30,000 కంటే తక్కువ బడ్జెట్‌లోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులోని మిడిల్ వేరియంట్ మరింత తక్కువ ధరకే లభించబోతున్నట్లు సమాచారం. అయితే ఒప్పో ఇప్పటికీ ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ధరను అధికారికంగా ప్రకటించలేదు.

ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్:
6.7 అంగుళాల పూర్తి-HD+ డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్
93 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో
360Hz టచ్ శాంప్లింగ్ రేట్‌
1080×2412 పిక్సెల్ రిజల్యూషన్‌

Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News