Raksha Bandhan Offer 2023: రాఖీ పండగ సందర్భంగా Sony, JBL బ్రాండ్‌లపై 70 శాతం తగ్గింపు..రూ.1,099లోపే ఇయర్‌బడ్స్‌..

Raksha Bandhan Offer On Earbuds: రాఖీ పండగ సందర్భంగా అమెజాన్ సేల్‌లో ఇయర్‌బడ్స్‌పై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. ఈ బ్రాండ్‌లకు సంబంధించిన ఇయర్‌బడ్‌ను కొనుగోలు చేస్తే 70 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 29, 2023, 01:18 PM IST
Raksha Bandhan Offer 2023: రాఖీ పండగ సందర్భంగా Sony, JBL బ్రాండ్‌లపై 70 శాతం తగ్గింపు..రూ.1,099లోపే ఇయర్‌బడ్స్‌..

Raksha Bandhan Offer On Earbuds: ప్రముఖ ఆన్‌లైన్ ఈ కామర్స్‌ కంపెనీ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో రాఖీ పండగను దృష్టిలో పెట్టుకుని మెగా మ్యూజిక్ ఫెస్ట్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని ఎలక్ట్రిక్‌ వస్తువులపై ప్రత్యేక తగ్గింపు నడుస్తోంది. ముఖ్యంగా ఈ సమయంలో ఇయర్‌బడ్‌లు, హెడ్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తే దాదాపు 70 శాతంకు పైగా తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా వీటిపై బ్యాంకు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు ప్రీమియం ఆడియో వేరబుల్స్‌పై నో-కాస్ట్ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. అయితే రాఖీ సందర్భంగా ఏయే ఇయర్‌బడ్‌లపై ప్రత్యేక తగ్గింపు లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Noise VS104 Earbuds:
నాయిస్ బ్రాండ్‌కి సంబంధించిన ఇయర్‌బడ్స్, స్మార్ట్‌ వాచ్‌లకి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. కంపెనీ నాయిస్‌ VS104 ఇయర్‌బడ్స్‌ను రూ.3,499లకు విక్రయిస్తోంది. రాఖీ పండగను దృష్టిలో అమెజాన్ సేల్‌లో భాగంగా ఈ ఇయర్‌బడ్స్ రూ.1,099లకే లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఇయర్‌బడ్స్‌ బ్లాక్, మిడ్‌నైట్ బ్లూ, మింట్ గ్రీన్, వైట్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తోంది. ఇది బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ, హైపర్ సింక్ టెక్నాలజీతో 45 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ సమయాన్ని కలిగి ఉండబోతోంది. 

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

Sony WF-C700N TWS Earbuds:
సోనీ ఇటీవలే భారత మార్కెట్‌లో అల్ట్రా-ప్రీమియం ఇయర్‌బడ్స్‌ను విడుదల చేసింది. అయితే వీటిని Sony WF-C700N TWS Earbuds నామకరణంతో లాంచ్‌ చేసింది. మొదట కంపెనీ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో రూ.12,999లకు విక్రయించింది. రాఖీ పండగను దృష్టిలో అమెజాన్ సేల్‌లో రూ.8,999లకే లభిస్తోంది. ఇక ఫీచర్స్‌తో విషయానికొస్తే.. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), యాంబియంట్ మోడ్, మల్టీపాయింట్ కనెక్టివిటీ చాలా రకాల ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. 

JBL Tune 130Nc Wireless Earbuds:
ప్రీమియం ఆడియో ఇయర్‌బడ్‌లకు పెట్టింది పేరు JBL Tune 130Nc వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు. అయితే ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా ఈ ఇయర్‌బడ్స్‌పై దాదాపు  40% తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా వీటిపై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అన్ని ఆఫర్స్‌ పోను ఈ ఇయర్‌బడ్స్‌ రూ.4,299లకే లభిస్తున్నాయి. ప్రస్తుతం ఇవి బ్లాక్, బ్లూ, వైట్ కలర్ వేరియంట్లలో లభిస్తున్నాయి. ఇక ఫీచర్స్‌ విషయానికొస్తే..ఇయర్‌బడ్‌లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ ఫీచర్‌ను కలిగి ఉంటాయి. 

ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News