Realme New Variant: రియల్‌మి నుంచి కళ్లు చెదిరే ఫోన్,108 మెగాపిక్సెల్ కెమేరాతో.. మీరే చూడండి

Realme New Variant: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ రియల్‌మి ఇప్పుడు కొత్త మోడల్ లాంచ్ చేసింది. అద్భుత ఫీచర్లతో తక్కువ ధరకు లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాగానే పెద్దఎత్తున డిమాండ్ ఏర్పడింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 22, 2022, 06:59 PM IST
Realme New Variant: రియల్‌మి నుంచి కళ్లు చెదిరే ఫోన్,108 మెగాపిక్సెల్ కెమేరాతో.. మీరే చూడండి

Realme New Variant: రియల్‌మి ఇప్పుడు కొత్తగా Realme 10 Pro Realme 10 Pro Plus లాంచ్ చేసింది. తక్కువ ధరకు..అద్భుతమైన ఫీచర్లు ఉండటంతో అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ఒక్క కెమేరా మెగాపిక్సెల్ చూస్తేనే మతిపోతుంది.

Realme 10 Pro Realme 10 Pro Plus ఇటీవలే ఈ నెల ప్రారంభంలో లాంచ్ అయింది. ఇందులో 700 డైమెన్షన్ చిప్ ఉంది. Realme 10 Pro Realme 10 Pro Plus స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయగానే ఈ స్మార్ట్ ఫీచర్ల కారణంగా ఆదరణ పెరిగింది. ప్రో సిరీస్‌లోని కొన్ని ఫీచర్లలో 120Hz LCD / AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 695 / డైమెన్షన్ 1080 చిప్, 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు. రియల్‌మి 10 ప్రో లైనప్ ఫీచర్లు, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

రియల్‌మి 10 ప్రో ప్రత్యేకతలు

రియల్‌మి 10 ప్రోలో 6.7 ఇంచెస్ ఎల్‌సిడీ ప్యానల్ ఉంది. ఇది ఫుల్ హెచ్‌డి రిజల్యూషన్ , 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. ఫ్లాట్ స్క్రీన్ మధ్యలో పంచ్ హోల్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఇందులో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఉంది.

ఈ ఫోన్ వెనుకవైపు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 2 మెగాపిక్సెల్ మైక్రోస్నాపర్ ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్ రియల్‌మి 10 ప్రోను 8 జీబీ ర్యామ్ వరకూ, LPDDR4x ర్యామ్ వరకూ, 256 జీబీ వరకూ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. సెక్యూరిటీ కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది.

రియల్‌మి 10 ప్రో ఫీచర్లు

రియల్ 10 ప్రో కంపెనీ నెంబర్ సిరీస్‌లో మొదటిది. ఇందులో ఎమోల్డ్ ప్యానల్ ఉంది. స్క్రీన్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ 2160 హెర్ట్జ్, అండర్ డిస్‌‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 173 గ్రాములు కాగా 7.78 మిల్లీమీటర్ల లావుంటుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంది. అంతేకాకుండా 33 వాట్స్ 67 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇందులో ఆండ్రాయిడ్ 13 ఇన్‌స్టాల్ అయుంటుంది. ఈ రెండు మోడల్స్ 5జి సపోర్ట్ చేస్తాయి.

రియల్‌మి 10 ప్రో సిరీస్ ధర

రియల్‌మి 10 ప్రో 8జిబి ర్యామ్, 256 స్టోరేజ్ ధర 1599 యువాన్‌ లుగా ఉంది. 12 జిబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ అయితే 1899 యువాన్‌లుగా ఉంది. అదే రియల్‌మి 10 ప్రో ప్లస్‌లో 8జిబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 1699 యూవాన్‌లుగా ఉంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర 1999 యువాన్‌లుగా ఉంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర 2299 యవాన్‌లుగా ఉంది.

Also read: Flipkart Mobile Offers: 13 వేల రియల్‌మి స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు కేవలం 549 రూపాయలకే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News