Samsung Galaxy A15 5G Price Dropped: ఎప్పటినుంచో అత్యంత తక్కువ ధరలోనే అద్భుతమైన ఫీచర్స్ తో కూడిన మంచి సాంసంగ్ మొబైల్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకు సమయం రానే వచ్చింది. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన సాంసంగ్ మొబైల్స్ అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా కొన్ని ఈ కామర్స్ వెబ్సైట్లో ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా డెడ్ చీప్ ధరలకే లభిస్తున్నాయి. దీంతోపాటు సాంసంగ్ బ్రాండ్ కు సంబంధించిన కొన్ని మొబైల్స్ రిలయన్స్ డిజిటల్ లో కూడా అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.
ఇయర్ అండ్ సేల్ లో భాగంగా రిలయన్స్ డిజిటల్ అధికారిక వెబ్సైట్లో సాంసంగ్ మొబైల్స్ ను కొనుగోలు చేసే వారికి ప్లాట్ డిస్కౌంట్ తో పాటు అదనంగా మరెన్నో డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ మొబైల్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..రిలయన్స్ డిజిటల్ లో Samsung Galaxy A15 5G స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసే వారికి గుడ్ న్యూస్ గా భావించవచ్చు. ఈ మొబైల్ పై ప్రత్యేకమైన ఫ్లాట్ తగ్గింపు లభించడమే కాకుండా అదనంగా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో దీని ధర MRP రూ.19,499 కాగా ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది.
ఇక ఈ మొబైల్ పై ఉన్న ఫ్లాట్ తగ్గింపు వివరాల్లోకి వెళితే.. రిలయన్స్ డిజిటల్ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేసే వారికి 13 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్ పోను రూ.16,999కే కొత్త మొబైల్ పొందవచ్చు. ఇక మరింత తగ్గింపు ధరకు ఈ మొబైల్ ను పొందాలనుకుంటే బ్యాంక్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు. ఈ Samsung Galaxy A15 5G స్మార్ట్ ఫోన్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. రిలయన్స్ డిజిటల్ లో ఈ మొబైల్ అతి తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకునేవారు అదనంగా బ్యాంకు తగ్గింపు పొందడానికి వన్ కార్డ్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
అంతేకాకుండా భారీ మొత్తంలో తగ్గింపు పొందాలనుకునేవారు J మరియు K బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డును వినియోగించి బిల్ కడితే.. ఏకంగా రూ.2,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అన్ని ఆఫర్స్ పోనూ..రూ.14,499కే పొందవచ్చు. అలాగే ఈ మొబైల్ పై అదనంగా ప్రొటెక్షన్స్ సపోర్టును కూడా అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేరుగా రిలయన్స్ డిజిటల్ అధికారిక వెబ్సైట్లోనే అందుబాటులో ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.