Samsung Galaxy F55 5G Price: 50 MP బ్యాక్‌ కెమెరా, 128GB స్టోరేజ్‌తో Galaxy F55 మొబైల్‌ రాబోతోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌..

Samsung Galaxy F55 5G Price: సాంసంగ్‌ నుంచి త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా Snapdragon 7 Gen 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 1, 2024, 03:27 PM IST
Samsung Galaxy F55 5G Price: 50 MP బ్యాక్‌ కెమెరా, 128GB స్టోరేజ్‌తో Galaxy F55 మొబైల్‌ రాబోతోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌..

 

Samsung Galaxy F55 5G Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ సాంసంగ్‌ త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ను లాంచ్ చేయబోతోంది. దీనిని కంపెనీ Galaxy F55 5G పేరుతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంపెనీ లాంచ్‌ చేసిన F సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్‌లో మంచి గుర్తింపు లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇటీవలే లీక్‌ అయిన వివరాల ప్రకారం.. ఇది M-E556B మోడల్‌ నెంబర్‌తో గ్లోబల్‌ లాంచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ Samsung Galaxy F55 5G మొబైల్‌కి సంబంధించిన ఫుల్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

త్వరలోనే లాంచ్‌ కాబోయే ఈ Galaxy F55 మొబైల్ Geekbench సింగిల్-కోర్ పరీక్షలో 843 పాయింట్లను సాధించిన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మల్టీ-కోర్ పరీక్షలో 2307 పాయింట్లు పొందింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ Android 14పై పని చేస్తుంది. అంతేకాకుండా ఇది టారో మదర్‌బోర్డ్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ Adreno 644 GPU సెటప్‌తో వస్తోంది. ఇది Snapdragon 7 Gen 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా సాంసంగ్‌ ఈ మొబైల్‌ను Snapdragon 7 Gen 1 ప్రాసెసర్‌తో లాంచ్‌ చేయబోతోంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన ర్యామ్‌ వివరాల్లోకి వెళితే, ఇది 8GB ర్యామ్‌తో అందుబాటులోకి వస్తుంది. 

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
లీక్‌ అయిన వివరాల ప్రకారం..ఈ Galaxy F55 స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. ఇది  120Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తోంది. దీంతో పాటు గరిష్టంగా 1000 నిట్‌ల ప్రకాశవంతమైన డిప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రాబోతోంది. దీని బ్యాక్‌ సెటప్‌లో LED ఫ్లాష్‌తో పాటు త్రిపుల్‌ కెమెరాలతో రాబోతోంది. ఇది 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ కెమెరాతో రాబోతోంది. దీంతో పాటు 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్‌ ధర విషయానికొస్తే.. ఇది 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ధర రూ.26,999తో అందుబాటులోకి వస్తోంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఇతర ఫీచర్స్‌:
8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా 
50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ
45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
Android 14 ఆధారంగా OneUI 6.1
Wi-Fi 6 కనెక్టివిటీ
బ్లూటూత్ 5.2 
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News