MegaPad 11 Price: రూ.14 వేలకే దిమ్మతిరిగే ఫీచర్స్‌తో Tecno MegaPad 11 ట్యాబ్‌ లాంచ్‌.. ఇక మార్కెట్‌లో ప్రభంజనమే!

Tecno MegaPad 11 Price: మార్కెట్‌లోకి ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో Tecno MegaPad 11 ట్యాబ్‌ అందుబాటులోకి రాబోతోంది. ఇది 8,000mAh బ్యాటరీతో విడుదల కానుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Dec 5, 2024, 02:55 PM IST
 MegaPad 11 Price: రూ.14 వేలకే దిమ్మతిరిగే ఫీచర్స్‌తో Tecno MegaPad 11 ట్యాబ్‌ లాంచ్‌.. ఇక మార్కెట్‌లో ప్రభంజనమే!

Tecno MegaPad 11 Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ టెక్నోకి మార్కెట్‌లో ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు లభిస్తోంది. ఇదే తరుణంలో ఈ కంపెనీ వరసగా కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా ఈ కంపెనీ కొత్త ట్యాబ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

మార్కెట్‌లోకి టెక్నో కంపెనీ మెగాప్యాడ్ 11 ట్యాబ్‌ను లాంచ్‌ చేసింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదలైంది. ముఖ్యంగా ఈ ట్యాబ్‌ మోస్ట్‌ పవర్‌ఫుల్‌ 11-అంగుళాల పూర్తి-HD+ స్క్రీన్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా మల్టీ టాస్కింగ్‌ కూడా సులభంగా చేసేందుకు 16GB ర్యామ్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు 8,000mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. ఇది MediaTek Helio G99 చిప్‌సెట్‌పై రన్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే అనేక AI-ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆండ్రాయిడ్ 14తో అందుబాటులోకి ఈ ట్యాబ్‌ విడుదల కానుంది. 

టెక్నో మెగాప్యాడ్ 11 ట్యాబ్‌ ఫీచర్స్‌, స్పెసిఫికేషన్స్‌:
Tecno MegaPad స్మార్ట్‌ ట్యాబ్‌ 11 90Hz రిఫ్రెష్ రేట్, 440nits హై బ్రైట్‌నెస్‌ డిస్ల్పేతో అందుబాటులోకి వచ్చింది. ఇది 1,200 x 1,920 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. దీనికి డార్క్ మోడ్‌ సపోర్ట్‌ ఆప్షన్‌ కూడా లభిస్తోంది. అలాగే ఇది మార్కెట్‌లో 128GB స్టోరేజ్‌ వేరియంట్‌తో పాటు 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా స్టోరేజ్‌ను పెంచేందుకు మైక్రో SD కార్డ్‌ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇందులో కొన్ని AI ఫీచర్స్‌ లభిస్తున్నాయి.   

ఈ టెక్నో మెగాప్యాడ్ 11 ట్యాబ్‌లో AI నాయిస్ కాల్ కాన్సిలేషన్‌ సపోర్ట్‌తో పాటు ఇంటెలిజెంట్ స్క్రీన్ రికగ్నిషన్ ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి. అలాగే కంపెనీ ఇందులో  AI- పవర్డ్ ఎల్లా వాయిస్ అసిస్టెంట్‌ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ఈ ట్యాబ్‌ బ్యాక్‌ సెటప్‌లో 13-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా కలిగి అలాగే ఫ్రంట్‌లో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌ కూడా లభిస్తోంది. ఇక ఇందులో ఎంతో శక్తివంతమైన 8,000mAh బ్యాటరీ కూడా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఇతర ఫీచర్స్‌ కూడా లభిస్తాయి. ఈ ట్యాబ్‌ను కంపెనీ రూ.14,990కే అందుబాటులోకి తీసుకు వచ్చింది. 

ఇదీ చదవండి: మాజీ మంత్రి ఎన్సీపీ లీడర్‌ బాబా సిద్ధిఖీ దారుణ హత్య.. సల్మాన్‌ ఖాన్‌కు ఈ మర్డర్‌తో ఉన్న లింక్‌ అదేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News