Water Purifier Price Drop: అమెజాన్‌లో రాఖీ సందర్భంగా సగం ధరకే Aquaguard Aura 2X వాటర్‌ ప్యూరిఫైయర్..

Aquaguard Aura 2X Life Water Purifier Price Drop: అతి తక్కువ ధరలోనే మంచి టెక్నాలజీ తో కూడిన వాటర్ ప్యూరిఫైయర్ ని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయంలో భావించవచ్చు. అమెజాన్ లో రాఖీ సందర్భంగా కొన్ని వాటర్ ప్యూరిఫైయర్స్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 19, 2024, 12:53 PM IST
Water Purifier Price Drop: అమెజాన్‌లో రాఖీ సందర్భంగా సగం ధరకే Aquaguard Aura 2X వాటర్‌ ప్యూరిఫైయర్..

Aquaguard Aura 2X Life Water Purifier Price Drop: మార్కెట్లో క్రమంగా వాటర్ ప్యూరిఫైయర్ డిమాండ్ పెరుగుతూ వస్తోంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఇళ్లలోనే వాటర్ ప్యూరిఫైయర్స్ ని బిగించుకుంటున్నారు. దీంతో మార్కెట్లో ఒక్కసారిగా వాటర్ ప్యూరిఫైయర్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చాలా కంపెనీలు ప్రీమియం ఫీచర్స్ తో కూడిన వాటర్ ప్యూరిఫైయర్స్ ని తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని కంపెనీలు అతి తక్కువ ధరల్లోనే అద్భుతమైన ఫీచర్లతో కూడిన ప్యూరిఫైయర్స్ అందిస్తున్నాయి. మీరు కూడా ఎప్పటినుంచో మంచి వాటర్ ప్యూరిఫైయర్ ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్లో ఈ అద్భుతమైన ఆఫర్ ని వదులుకోకండి. 

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో Aquaguard గతంలో విడుదల చేసిన Aura 2X Life వాటర్ ప్యూరిఫైయర్ కి మంచి డిమాండ్ లభించింది. దీంతో క్రమంగా విక్రయాలు పెరుగుతూ వచ్చాయి. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని అమెజాన్ రాఖీ పండుగ సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్స్ తో విక్రయిస్తోంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి బ్యాంక్ ఆఫర్స్ తో పాటు అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇవే కాకుండా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఆదనంగా మరెన్నో ప్రత్యేకమైన డిస్కౌంట్ కూపన్స్ లభిస్తున్నాయి. అయితే ఇవే కాకుండా ఈ వాటర్ ప్యూరిఫైయర్ పై ఉన్న ఇతర ఆఫర్స్ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

ఈ వాటర్ ప్యూరిఫైయర్ పై ఉన్న ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. మొదటగా ఈ Aquaguard Aura 2X Life వాటర్ ప్యూరిఫైయర్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఇందులోని ప్రీమియం వేరియంట్ RO+UV టెక్నాలజీ తో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో దీని అసలు ధర రూ.29,000 కాగా.. రాఖీ పండగ సందర్భంగా ఇప్పుడే కొనుగోలు చేసే వారికి 45% తగ్గింపుతో కేవలం రూ. 15,999కే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు. దీనికోసం యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే వన్ కార్డు క్రెడిట్ కార్డ్, హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా రూ. 1,750 వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో డిస్కౌంట్ ఆఫర్స్ అన్నీ పోను రూ. 14,249కే లభిస్తుంది. 

ఇవే కాకుండా ఈ వాటర్ ప్యూరిఫైయర్ పై అమెజాన్  ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ను వినియోగించి కొనుగోలు చేయాలని వారు ముందుగా తప్పకుండా పాత వాటర్ ప్యూరిఫైయర్ ను అమెజాన్ కి ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది పాత వాటర్ ప్యూరిఫైయర్ బ్రాండ్, కండిషన్ను బట్టి ఆధారపడి ఉంటుంది. కండిషన్ బాగుంటేనే ఫైల్ ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. లేకపోతే ఈ బోనస్ లో మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News