Whatsapp Top 5 Features: వాట్సాప్ ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్. వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మనదేశంలో ప్రతి స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ ఉంటోంది. వినియోగదారులకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ను పరిచయం చేస్తూ.. సరికొత్త అనుభూతిని అందిస్తోంది వాట్సాప్ మాతృ కంపెనీ మెటా. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా అనేక మార్పులు చేస్తూ.. సరికొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. వాట్సాప్ వినియోగదారులు తప్పకుండా ఐదు ఫీచర్లు గురించి తెలుసుకోవాలి.
హెచ్డీ ఫోటోలను సెండ్ చేయండి
ఇన్నాళ్లు వాట్సాప్‌లో పిక్స్ సెండ్ చేస్తే వాటి క్వాలిటీ తగ్గిపోయేది. రీసెంట్గా ఈ సమస్యకు చెక్ పెట్టింది మెటా. హెచ్డీ ఫొటోలను సెండ్ చేసే అవకాశం కల్పించింది. Android, iOS మొబైల్స్ నుంచి వాట్సాప్ హెచ్డీ ఫోటోలను పంపించవచ్చు. హెచ్డీ వీడియో షేరింగ్ ఫీచర్‌ను కూడా పరిచయం చేసింది.
వీడియో మెసేజ్‌లు
వాట్సాప్‌లో చిన్న వీడియోతో సందేశాలతో రిప్లై ఇవ్వచ్చు. ఈ సరికొత్త ఫీచర్ వినియోగదారులు స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్‌తో సంభాషించేటప్పుడు చిన్న వీడియోలను పంపడానికి అనుమతిస్తుంది.
గుర్తుతెలియని నంబర్లు మ్యూట్ చేయండి
వాట్సాప్‌లో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కాల్స్‌తో విసిగిపోయి ఉంటే.. వాటిని మ్యూట్ చేసుకోవచ్చు. వినియోగదారుల గోప్యతను మెరుగుపరచడానికి వాట్సాప్‌లో ఈ కాల్స్‌ను మ్యూట్ చేసుకునే అవకాశం కల్పించింది మెటా. అపరిచితుల నుంచి ఆడియో, వీడియో కాల్లకు దూరంగా ఉండేందుకు మ్యూట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
మెసెజ్‌లను ఎడిట్ చేయండి
మనం ఒక్కోసారి స్పెల్లింగ్ మిస్టెక్స్‌తో మెసేజ్‌లను పంపిస్తుంటాం. తరువాత చూసుకుని.. అయ్యే అని డిలీట్ చేసి మరోసారి టైప్ చేసి పంపిస్తాం. ఇక నుంచి ఇలా చేయకుండా ఎడిట్ ఫీచర్‌ను మెటా పరిచయం చేసింది. వినియోగదారులను వాటాప్‌లో టెక్ట్స్ సందేశాన్ని ఎడిట్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే మెసేజ్ పంపించిన 15 నిమిషాలలోపు మాత్రమే ఎడిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
Also Read: TS Politics: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జంప్.. పార్టీ మారనున్న నేతలు వీళ్లే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook