హైదరాబాద్‌కు చెందిన ఏడేళ్ల బాలుడు ఆఫ్రికాలోని ఎత్తైన పర్వతం ఎక్కాడు. టాంజానియాలోని కిలిమంజారో పర్వతం యొక్క ఉహురు శిఖరాన్ని అధిరోహించి సత్తా చాటాడు. ఏప్రిల్ 2న సమన్యు పోతురాజు అనే బాలుడు కోచ్‌తో కలిసి సముద్ర మట్టానికి 5,895 మీటర్ల ఎత్తులో భారత తివర్ణ పతాకాన్ని ఎగురువేశాడు.
బాలుడు మాట్లాడుతూ, "ఆ రోజు వర్షంతో పాటు రహదారి రాళ్లతో నిండిపోయింది. నేను భయపడ్డాను. నాకు కాలి నొప్పి ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకుంటూ నా గమ్యాన్ని చేరుకున్నాను. నాకు మంచు అంటే చాలా ఇష్టం. అందుకే కిలిమంజారో పర్వతాన్ని వెళ్లాను. పవన్ కళ్యాణ్ నా అభిమాన హీరో. అమ్మ నేను ప్రపంచ రికార్డును సాధించినట్లయితే కలుస్తానని మాటిచ్చింది. నేను అమ్మను కలవటానికి ఎదురు చూస్తున్నాను. నేను వచ్చే నెలాఖరులో ఆస్ట్రేలియా శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్తాను." అని అన్నాడు.
తన కుమారుడు ప్రపంచ రికార్డు సాధించడానికి ప్రయత్నిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు పోతురాజు తల్లి లావణ్య. 'నేనూ అతడి బృందంలో ఉన్నాను. అయితే నా ఆరోగ్య పరిస్థితి కారణంగా సగంలోనే ఆగిపోయాను. కానీ నా కొడుకు గమ్యాన్ని చేరుకొనే వరకు విడిచిపెట్టలేదు. వాతావరణ పరిస్థితులు సరిగాలేనందున నేను చాలా భయపడ్డాను. మా తదుపరి లక్ష్యమే మే చివర్లో ఆస్ట్రేలియాలోని 10 పీక్స్ అధిరోహించడమే " అన్నారు. ఈ ట్రెక్ మార్చి 29న ప్రారంభమైంది. జట్టు శిఖరానికి చేరుకోవడానికి ఐదు రోజులు పట్టింది.