Election Manifesto: ఎన్నికలొచ్చిన ప్రతిసారీ పార్టీల మ్యానిఫెస్టోలు విడుదలవుతుంటాయి. ఊకదంపుడు హామీలిస్తుంటాయి. తరువాత మర్చిపోతుంటాయి. మరి అసలు మ్యానిఫెస్టోనే విడుదల చేయని పార్టీ ఒకటుంది తెలుసా..నిజమే..ఇదిగో ఆ వివరాలు.
మ్యానిఫెస్టో ( Manifesto ) అనేది ప్రతి పార్టీకు గుండెకాయ లాంటిది. మ్యానిఫెస్టోలో అంశాల్ని బట్టే ప్రజల్ని ఆకర్షిస్తుంటాయి రాజకీయ పార్టీలు. అయితే అతి కొద్ది పార్టీలే మ్యానిఫెస్టో అంశాల్ని అమలు చేస్తాయి. ఎక్కువ శాతం పార్టీలు గాలికొదిలేస్తాయి. అయినా సరే మ్యానిఫెస్టో మాత్రం ప్రతి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విడుదల చేస్తుంటాయి. మరి అసలు మ్యానిఫెస్టోనే విడుదల చేయని పార్టీ ఒకటుందని తెలుసా.. ఆశ్చర్యంగా ఉందా. నిజమే. పాతబస్తీ రాజకీయాల్ని శాసిస్తూ జాతీయ స్థాయికి ఎదిగిన మజ్లిస్ పార్టీ ( Majlis party ) అది. ఎంఐఎం పార్టీ ( MIM party ) ఇప్పటివరకూ ఎప్పుడూ అసలు మ్యానిఫెస్టోనే విడుదల చేయలేదు. మ్యానిఫెస్టో లేకుండానే ఎన్నికల్లో దిగుతుంటుంది. విజయం సాధిస్తుంటుంది. అసలు ఈ పార్టీ వ్యూహాలేంటి, ప్రతి వ్యూహాలేంటనేది రాజకీయ ఉద్ధండులకే అంతు చిక్కదు. పార్టీ ఏ ఎన్నికల్లోనూ హామీలివ్వదు. వాగ్దానాలు చేయదు.
ఎంఐఎంలో పార్టీ అధినేతదే కీలక నిర్ణయం. బీహార్ ఎన్నికల్లో ( Bihar Elections ) 5 మంది శాసనసభ్యుల్ని గెలిపించుకున్నా సరే..మ్యానిఫెస్టో ప్రకటించలేదు. అసలీ పార్టీలో బుజ్జగింపులు, సర్దుబాట్లనేవి ఉండవట. ఎన్నికల మేనిఫెస్టో అనేది ఒక మోసమని..ప్రజల్ని మోసం చేసే డాక్యుమెంట్ అని పార్టీ అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే ఏ ఎన్నికల్లోనూ ఎంఐఎం మేనిఫెస్టోను విడుదల చేయదు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయలేదు. మతపరమైన వ్యవహారాలు , పార్టీ పనితీరు, ప్రజలకు అందుబాటులో ఉండటంపైనే పార్టీ ఎక్కువగా దృష్టి పెడుతుంటుంది. డోర్ టు డోర్ ప్రచారాన్ని పార్టీ అధినేతలు కూడా స్వయంగా చేస్తుంటారు. పార్టీ నేతలు అసదుద్దీన్ ఒవైసీ ( Asaduddin owaisi ), అక్బరుద్దీన్ ఒవైసీ ( Akbaruddin owaisi )ల ప్రసంగాలే పార్టీకు ప్రచారాస్త్రాలుగా ఉంటుంటాయి.
హామీలు, వాగ్దానాల్లేకపోయినా..అభ్యర్ధుల పనితీరే గెలిపిస్తుందనేది పార్టీ నమ్మకం. గత జీహెచ్ఎంసీ ఎన్నిక ( Ghmc Elections ) ల్లో షహెర్ హమారా..మేయర్ హమారా అనే నినాదంతో బరిలో దిగి..గ్రేటర్ హైదరాబాద్ యాక్షన్ ప్లాన్ అనే డాక్యుమెంట్ విడుదల చేసింది.
Also read: Asaduddin Owaisi: ఉగ్రవాదంపై అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు!