Tribal Woman dranks sesame oil to fulfils Vow: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని 'ఖాందేవ్' ఆలయంలో ఓ ఆదివాసీ మహిళ 'నూనె మొక్కు' చెల్లించుకుంది. తొడసం వంశీయుల సమక్షంలో మట్టి పాత్రలో 2.5 కిలోల నువ్వుల నూనెను ఒకేసారి తాగింది. ప్రతీ ఏటా పుష్య మాసంలో జరిగే ఖాందేవ్ జాతరలో తొడసం వంశీయుల ఆడపడుచు ఇలా నూనె మొక్కు చెల్లించుకోవడం ఆచారంగా వస్తోంది.
మంగళవారం (జనవరి 18) ఖాందేవ్ జాతర సందర్భంగా వందలాది ఆదివాసీలు ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా మహా పూజ నిర్వహించారు. అనంతరం తొడసం వంశీయుల ఆడపడచు యోత్మభాయి 'నూనె మొక్కు' చెల్లించింది. ఖాందేవ్ మహా పూజ కోసం తొడసం వంశంలోని ప్రతీ ఇంటి నుంచి నువ్వుల నూనెను తీసుకొస్తారు. ఆ నూనెను మట్టి పాత్రలో సేకరించి తొడసం ఆడపడుచు సేవించడం ఇక్కడి ఆదివాసీలు అనాదిగా పాటిస్తున్న ఆచారం.
తమ కుటుంబాలను, పాడి పంటలను ఖాందేవ్ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ నూనె మొక్కును చెల్లిస్తారు. ఒకసారి నూనె మొక్కును చెల్లించే ఆదివాసీ మహిళ.. వరుసగా మూడేళ్ల పాటు ఆ మొక్కును చెల్లించాల్సి ఉంటుంది. గత మూడేళ్ల పాటు యాధవి అవంతి భాయ్ (38) అనే ఆదివాసీ మహిళ ఈ మొక్కు చెల్లించారు.
ఖాందేవ్ జాతర :
ఆదివాసీల ఆరాధ్య దైవాల్లో ఖాందేవ్ ఒకరు. ఖాందేవ్ దేవుడినే 'పులి దేవుడు'గా పిలుస్తారు. నార్నూర్ మండల కేంద్రంలో ఉన్న ఖాందేవ్ ఆలయంలో.. దేవతామూర్తి ప్రతిమ పులి ఆకారంలో ఉంటుంది. ప్రతీ ఏటా పుష్య మాసంలో ఆదివాసీలు ఇక్కడ జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తొడసం వంశీయులు మహా పూజ నిర్వహిస్తారు. కేవలం తెలంగాణ (Telangana) నుంచే కాక మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు జాతరకు తరలివస్తారు. రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఈ జాతర ఈ నెల 30 వరకు జరగనుంది. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ జాతర నిర్వహిస్తున్నారు.
Also Read: Bihar Katihar Newborn: బీహార్‌లో వింత శిశువు జననం... నాలుగు కాళ్లు, నాలుగు చేతులు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook