New liquor policy: తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియ షురూ

New liquor shops: తెలంగాణలో కొత్త మద్యం పాలసీ కింద నూతన మద్యం దుకాణాల ఏర్పాటుక దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది.ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2021, 05:33 PM IST
  • తెలంగాణలో కొత్త మద్యం పాలసీ
    అదనంగా మరో 404 మద్యం దుకాణాల ఏర్పాటు
    నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ షురూ
New liquor policy: తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తుల ప్రక్రియ షురూ

Telangana new liquor policy: తెలంగాణలో నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు మంగళవారం(నవంబర్ 9) నుంచి ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) వెల్లడించారు. ఒక వ్యక్తి ఎన్ని మద్యం దుకాణాలకైనా (Liquor shops) పోటీ పడవచ్చునని తెలిపారు. ఈసారి బ్యాంక్ గ్యారెంటీ కూడా తగ్గించామని... దరఖాస్తుల ధర,లైసెన్స్ ఫీజు  పెంచలేదని అన్నారు. ప్రభుత్వానికి చెల్లించే డబ్బును మరిన్ని వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించామన్నారు. ముఖ్యంగా స్థానికులకే మద్యం దుకాణాలు దక్కేలా చర్యలు చేపట్టామన్నారు.

గతంలో మద్యం మాఫియా ఉండేదని... కల్తీ మద్యం అమ్మకాలు జరిగేవని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.కానీ ఇప్పుడా పరిస్థితి లేదని స్పష్టం చేశారు.రాష్ట్రంలో గుడుంబా అమ్మకాలను నియంత్రించామని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు పొరుగు రాష్ట్రాల్లో గంజాయి పండిస్తున్నారని... దానిపై నిఘా పెట్టామని అన్నారు.గంజాయి వ్యాపారం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.నిందితులపై పీడీ యాక్ట్ కేసులు పెడుతామన్నారు. విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్‌పై (Drugs) కూడా నిఘా పెట్టామని చెప్పారు. రాష్ట్రంలోని (Telangana) మద్యం దుకాణాల కేటాయింపులో ఎస్సీ,ఎస్టీ,గౌడ్‌లకు రిజర్వేషన్లు కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

Also Read:Fake currency in Hyderabad : హైదరాబాద్ లో రూ.2 కోట్ల నకిలీ నోట్లు స్వాధీనం

రాష్ట్రంలో ప్రస్తుతం 2216 మద్యం దుకాణాలు ఉన్నాయి.ఈ డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుండటంతో మరో 404 మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం మద్యం దుకాణాల సంఖ్య 2620కి పెరిగింది. ఇందులో 756 మద్యం దుకాణాలను ఎస్సీ,ఎస్టీ,గౌడ్‌లకు రిజర్వేషన్ కింద కేటాయించారు. అధికారుల సమక్షంలో లాటరీ పద్దతిలో కేటాయింపులు జరిగాయి. ఎస్సీలకు 262,ఎస్టీలకు 131,గౌడ్‌లకు 363 మద్యం దుకాణాలు కేటాయించారు. మిగతా 1864 మద్యం దుకాణాలు (New liquor policy) ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News