Yadagirigutta Road Damage: యాదాద్రి ఆలయం చుట్టూ రాజకీయ రగడ మొదలైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నరసన్న ఆలయ ప్రాంగణం బుధవారం కురిసిన భారీ వర్షానికి తడిసిముద్దయ్యింది. గంటన్నరపాటు పడ్డ వానకు ఆలయ పరిసర ప్రాంతాలు నీటమునిగాయి. ఘాట్ రోడ్లు, ఆలయ క్యూ కాంప్లెక్సులు, మండపాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వరదపోటుకు మట్టి కొట్టుకుపోవడంతో ఘాట్ రోడ్డు ధ్వంసమైంది. దాంతో ఇంజినీరింగ్ పనుల్లో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. మరోవైపు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గంటన్నర వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే... ఇక రోజంతా వర్షం పడితే యాదగిరి గట్ట పూర్తిగా కొట్టుకుపోయేదేమో అని అనుమానం వ్యక్తం చేశారు.
ఎనిమిదేళ్లుగా ఆలయ నిర్మాణంపై గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా పరిస్థితులపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ సమన్వయ లోపం... అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని మండిపడ్డారు ఎంపీ కోమటిరెడ్డి. తాము ఆలయ నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అయితే వేలాది కోట్ల రూపాయయలు వెచ్చించి నిర్మించిన యాదాద్రి ఆలయం ఇలా ధ్వంసమవ్వడంపై రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఎనిమిదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి 20సార్లు వచ్చి ఉంటారు. అయితే పనుల పారదర్శకతపై ఆయన దృష్టిసారించిన దాఖలాలు ఏమీ కనిపిచండం లేవని విమర్శించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సినిమా సెట్లు వేసేవాళ్లకు గుత్తాధికారాలు ఇస్తే ఇలాగే ఉంటుందని ఎంపీ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సదరు కాంట్రాక్టర్ పై సీబీసీఐడీ విచారాణ జరిపించాలని డిమాండ్ చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
యాదాద్రి కొండపై పార్కింగ్ ఫీజు :
యాదగిరిగుట్ట దేవస్థానం కమిటీ కొండపై పార్కింగ్ ఫీజు విషయంలో వెనక్కి తగ్గింది. కొండపైకి వెళ్లే (నాలుగు చక్రాల) వాహనాలకు పార్కింగ్‌కు 100రూపాయల రుసుముఎత్తివేసి అదనపు గంటగా సమయాన్ని కేటాయించింది. కొండపైకి వెళ్లే వాహనాల పార్కింగ్ సంబంధించిన ఫీజు మాత్రం ఎప్పటిలాగే 500 రూపాయలుగా నిర్ణయించింది ఆలయ కమిటీ. ఇటీవలే పార్కింగ్ రుసుముపై ఉత్తర్వులు జారీ చేసింది ఆలయ కమిటీ. ఈ పార్కింగ్ బాదుడుపై సర్వత్వా విమర్శలు వెల్లువెత్తాయి.
Also Read: Remedies for Rahu: రాహు దోషంతో బాధపడుతున్నారా.. నివారణకు ఇదొక్కటే మార్గం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.