నాగర్ కర్నూల్ వాసికి అంతర్జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు

ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ పోటీల్లో తెలుగు వ్యక్తి సత్తా చాటాడు. తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన అశోక్ కుమారు అంతర్జాతీయ ఉత్తమ చిత్రకారుడిగా బహుమతి గెలుచుకున్నాడు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2021, 01:25 PM IST
నాగర్ కర్నూల్ వాసికి అంతర్జాతీయ ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు

International Best Photographer Award: ఫోటోగ్రఫీ సొసైటీ ఆఫ్ అమెరికా, సిగ్మా ఆర్ట్ అకాడమీ, హైదరబాద్ వారు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ ఫోటో నైపుణ్య వర్చువల్ పోటీల్లో...నాగర్ కర్నూలు జిల్లా(Nagar Kurnool District) కందనూల్ కు చెందిన వారాల అశోక్ కుమార్(Ashok Kumar) మహిళా విభాగంలో ఇంటర్నేషనల్ బెస్ట్ ఫోటోగ్రాఫర్ (International Best Photographer)గా నిలిచాడు. ఆదివారం ఫలితాలు ప్రకటించడంతో..ఇతడి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Also Read: Jugaad Bike Viral: ఇది బైకా? విమానమా? ఒకే సారి పది మంది ప్రయాణిస్తున్నారేంటీ!

అశోక్..మెుత్తంగా ఆయా ప్రాంతాల్లో తీసిన 16 ఫోటోలను ప్రదర్శించగా అరకు(Araku) వద్ద మహిళలు నీటి బిందెలను ఎత్తుకొని వెళ్తున్న సమయంలో క్లిక్ మనిపించిన ఫోటోకు ఈ అవార్డు దక్కింది. అయితే ప్రైజ్ మనీ కింద ప్రశంస పత్రం, రూ. 5000 నగదును అందుకున్నట్లు అశోక్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించునందుకు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అశోక్ గతంలో పలు జాతీయ , అంతర్జాతీయ పోటీలలో పలు అవార్డులు ఫోటోగ్రఫీ(Photography)లో పొందారు. ఈ పోటీల్లో 350 మంది ఫోటోగ్రాఫర్లు 43దేశాల నుండి పాల్గొన్నట్టు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News