MLA Jeevan Reddy: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యాయత్నం! నిందితుడి దగ్గర పిస్టల్ స్వాధీనం..

MLA Jeevan Reddy: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అధికార పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్12 లోని వేమూరీ ఎన్ క్లేవ్ లో ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఈ ఘటన జరిగింది.

Written by - Srisailam | Last Updated : Aug 2, 2022, 11:14 AM IST
MLA Jeevan Reddy: ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యాయత్నం! నిందితుడి దగ్గర పిస్టల్ స్వాధీనం..

MLA Jeevan Reddy: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అధికార పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్12 లోని వేమూరీ ఎన్ క్లేవ్ లో ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఈ ఘటన జరిగింది.
జీవన్ రెడ్డి పై హత్యాయత్నానికి ప్రయత్నించారు ఆర్మూర్ నియోజకవర్గం మాక్లూరు మండలం  కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త. తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో ఎమ్మెల్యేపై ఆమె భర్త   కక్ష పెంచుకున్నారని తెలుస్తోంది.

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో గుర్తించిన భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే నివాసానికి వచ్చిన బంజారాహిల్స్ పోలీసులు అనుమానాస్పద వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. నిందితుడు ప్రసాద్ గౌడ్  దగ్గర కత్తి, ఒక పిస్తోలు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే ఇంటిదగ్గర కత్తి, పిస్టల్ తో తిరుగుతున్న సర్పంచ్ భర్తను బంజారాహిల్స్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

Also Read: Al Zawahiri Killed: అల్ ఖైదా చీఫ్ అల్ జవహరీ హతం.. కాబూల్‌లో మట్టుబెట్టిన అమెరికా.. సర్జన్ నుంచి ఉగ్రవాదిగా మారిన జవహరీ.. 

Read also: Chikoti Praveen: బీజేపీలోకి టీడీపీ ఎంపీ క‌న‌క‌మేడ‌ల‌? క్యాసినో చీకోటీ ప్రవీణ్ తో లింకులే కారణమా?

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News