హైకోర్టులో కేసీఆర్ కు ఊరట ; అసెంబ్లీ రద్దు పిటిషన్లు కొట్టివేత

                     

Last Updated : Oct 12, 2018, 04:13 PM IST
హైకోర్టులో కేసీఆర్ కు ఊరట ; అసెంబ్లీ రద్దు పిటిషన్లు కొట్టివేత

హైదరాబాద్: తెలంగాణ ఆపధార్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కోట్టివేసింది. అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. గడువు ముగియక ముందే సరైన కారణం లేకుండా అసెంబ్లీ ని రద్దు చేసి ప్రజాస్వామ్యన్ని హేళన చేశారని పలువురు కోర్టును ఆశ్రయించారు. వీరిలో కాంగ్రెస్‌ నాయకురాలు డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి , న్యాయవాది శశాంక్‌రెడ్డి తదితరులు ఉన్నారు. వేర్వేరుగా వేసిన ఈ పిటిషన్లంటిపై ఒకేసారి విచారణ జరిపిన హైకోర్టు శుక్రవారం ఈ మేరకు తీర్పువెలువరించింది. తాజా తీర్పుపై టీఆర్ఎస్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై ఈనెల 31న విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది

Trending News