Azharuddin: రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్న అజహరుద్దీన్ వారసుడు అసదుద్దీన్..

Azharuddin: భారత మాజీ క్రికెటర్, ఎక్స్ ఎంపీ (లోకసభ) మెంబర్ మహ్మద్ అజహరుద్దీన్ కుమారుడు మహ్మద్ అసదుద్దీన్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనున్నారా అంటే ఔననే అంటున్నాయి రాజీకీయ వర్గాలు. తండ్రిలా క్రికెటర్ అవుతాడనుకున్న అసదుద్దీన్.. ఇపుడు సడెన్‌గా పాలిటిక్స్ వైపు ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 12, 2024, 12:40 PM IST
Azharuddin: రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్న అజహరుద్దీన్ వారసుడు అసదుద్దీన్..

Azharuddin: మహ్మద్ అజాహరుద్దీన్ తెలంగాణ వ్యక్తిగా భారత క్రికెట్ టీమ్ కెప్టెన్‌ స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి అక్కడ తన లక్‌ను పరీక్షించుకున్నారు. ఇపుడు ఆయన తనయుడు అసదుద్దీన్ కూడా త్వరలో పాలిటిక్స్‌లో అడుగు పెట్టాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.
అజాహరుద్దీన్ విషయానికొస్తే.. 2023 చివర్లో జరిగిన తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో అజహరుద్దీన్ జూబ్లీహిల్స్ (Jublee Hills)  అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్ధి టీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి గోపినాథ్ చేతిలో ఓటమి పాలైయ్యారు.

ఈయన గతంలో ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh), రాజస్థాన్ వంటి స్టేట్‌లో  పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు అజహరుద్దీన్. ప్రస్తుతం జూబ్లీహిల్స్ అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు తండ్రి నగరంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే... మరోవైపు తన తనయుడు మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ మహ్మద్ అసదుద్దీన్ ను కూడా కాంగ్రెస్ క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు అజాహరుద్దీన్.

ఇందులో భాగంగానే  మరికొన్నినెలల్లో జరగబోయే  పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి తనవంతు సహాయం అందించడానికి సమాయత్తా మవుతున్నాడు.   గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని యువ ఓటర్లను ఆకర్షించడానికి తన వంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ సహా వివిధ పార్టీల్లోని నాయకులు తమ వారసులను రాజకీయాల్లో ప్రొత్సహిస్తున్నారు. ఈ కోవలో అజాహరుద్దీన్ కూడా తన కుమారుడు అసదుద్దీన్‌ను కూడా పాలిటిక్స్‌లో  చురుగ్గా పాల్గొనే చూస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

అలాగే మైనంపల్లి హనుమంతరావు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నుంచి తన కుమారుడిని గెలిపించుకున్న సంగతి తెలిసిందే కదా. ఇలా చాలా మంది సీనియర్లు రాబోయే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ వారసులను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అంతేకాదు  క్రియాశీలకంగా  పనిచేసే వాతావరణం కల్పిస్తున్నారు. తాజాగా మాజీ కెప్టెన్ అజహారుద్దీన్ కూడా తన తనయుడిని వీలైనంత వేగంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరగుతోంది.

అందుకే మొదట పార్టీలో క్రియాశీలకంగా సేవలందించాలని సికిందరాబాద్, హైదరాబాద్, మల్కాజ్ గిరి, చేవెళ్ల పార్లమెంటు పరిధిలో చాలా విస్తృతంగా పర్యటించడానికి గ్రౌండ్ వర్క్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపునకు తనవంతు సహాయం అందించే ప్రయత్నంలో ఉన్నారు. అటు తండ్రి అజాహరుద్దీన్‌ బాటలో యువ కిషోరం మహ్మద్ అసదుద్దీన్ సిద్ధమవుతుండతంతో అటు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ, ఇటు అజహరుద్దీన్ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిస్తోంది.

Also read: Qatar government: ఆ 8 మందికి క్షమాభిక్ష, విడుదల చేసిన ఖతార్ దేశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News