TTDP chief Bakkani Narsimhulu: టీటీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు నియామకం

TTDP chief Bakkani Narsimhulu: హైదరాబాద్: టీటీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును నియమిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ ప్రకటన చేశారు. గతంలో షాద్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన బక్కని నర్సింహులు టిటిడి బోర్డు సభ్యుడిగానూ సేవలు అందించారు. టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ (L Ramana) ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2021, 02:24 PM IST
TTDP chief Bakkani Narsimhulu: టీటీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు నియామకం

TTDP chief Bakkani Narsimhulu: హైదరాబాద్: టీటీడీపీ అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును నియమిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ ప్రకటన చేశారు. గతంలో షాద్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన బక్కని నర్సింహులు టిటిడి బోర్డు సభ్యుడిగానూ సేవలు అందించారు. టీటీడీపీలో (TTDP) క్రమశిక్షణ కమిటీ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. 

Also read : Revanth Reddy, Kokapeta lands: రేవంత్ రెడ్డి హౌజ్ అరెస్ట్

రాష్ట్ర విభజన తర్వాత తెలుగు దేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నప్పటికీ.. మొదటి నుంచి ఇప్పటివరకు పార్టీలోనే కొనసాగుతూ తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేందుకు కృషి చేసినందుకు టీడీపీలో బక్కని నర్సింహులుకు (TTDP chief Bakkani Narsimhulu) దక్కిన గౌరవంగా టీడీపీ నేతలు చెబుతున్నారు. టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ (L Ramana) ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే.

Also read: AP CM YS Jaganపై అలిగి YSR Telangana Party పెట్టలేదన్న వైఎస్ షర్మిల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News