Manmohan Singh Tears: దేశాన్ని తన సంస్కరణలతో మార్చేసిన గొప్ప ఆర్థికవేత్త మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. అలాంటి మన్మోహన్ సింగ్‌ను కాంగ్రెస్ పార్టీ కంటతడి పెట్టించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఓటమికి ఆర్థిక సంస్కరణలు కారణంగా చూపుతూ మన్మోహన్ సింగ్‌ను నిందించారని హరీశ్ రావు గుర్తుచేశారు. ఈ సందర్భంగా నాడు మన్మోహన్ సింగ్‌కు జరిగిన అవమానాన్ని హరీశ్ రావు తెలిపారు.
Also Read: Telangana Assembly: కేటీఆర్ సంచలనం.. తొలిసారి రేవంత్ రెడ్డికి సంపూర్ణ మద్దతు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంతాప తీర్మానం కోసం సోమవారం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. సంతాప తీర్మానంపై అసెంబ్లీలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మన్మోహన్ సింగ్ గారు మనమధ్య లేకపోయినా.. వారి సేవలు చరిత్ర ఉన్నంతకాలం ఉంటాయని చెప్పారు. విదేశాల్లో పెద్ద ఉద్యోగాలను తిరస్కరించి.. ఈ దేశం నాకు ముఖ్యం అని మాతృభూమి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయులు అని కొనియాడారు. పదవుల కోసం ఆయన పాకులాడలేదని.. పదవులే ఆయన దగ్గరకు వచ్చాయని కీర్తించారు.
Also Read: K Kavitha: కేటీఆర్ ఫార్ములా ఈ కారు కేసు నుంచి నిప్పు కణికలా బయటకు వస్తారు
'మన్మోహన్ సింగ్‌ను దేశ రాజకీయాలకు మన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నర్సింహరావు పరిచయం చేశారు. తన మంత్రివర్గంలో మన్మోహన్ సింగ్‌ను పీవీ ఆర్థిక శాఖ మంత్రిగా తీసుకున్నారు. పీవీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దేశ ఆర్థికరంగానికి తనదైన శైలిలో దశదిశను మన్మోహన్ చూపారు. పారిశ్రామిక విధానాలతో పీవీ గొప్ప పేరు తెచ్చుకుంటే.. ఆర్థిక విధానాలతో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పేరు తెచ్చుకున్నారు' అని హరీశ్ రావు తెలిపారు. దేశాన్ని దివాళా పరిస్థితుల నుంచి గట్టెక్కించిన పీవీకి మన్మోహన్ సింగ్ ఒక చోదకశక్తిగా పనిచేశారని వివరించారు.
'యూపీఏ-2లో చాలా కుంభకోణాలు.. కేసులు.. అరెస్టులు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. అయినా మన్మోహన్ సింగ్‌ను ఒక చిన్న మచ్చకూడా రాలేదంటే వారి గొప్పతనమే. ఆర్బీఐ గవర్నర్‌గా కరెన్సీ నోట్లపై సంతకం చేసిన మన్మోహన్ సింగ్.. ఆర్ధిక మంత్రిగా.. ప్రధానమంత్రిగా దేశంపై చెరగని సంతకం చేశారు' అని కీర్తించాఉ. కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలనే తీర్మానాన్ని సమర్థిస్తున్నట్లు ప్రకటించారు.
'మన్మోహన్ సింగ్‌కు ఎన్నో చేదు అనుభవాలు జరిగాయి. ఆర్థిక వ్యవస్థను గాడీలో పెట్టి ఐదేండ్ల మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపారు పీవీ, మన్మోహన్ సింగ్. ఐదేండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆ ఓటమికి మన్మోహన్ సింగ్, పీవీ ఆర్థిక విధానాలు కారణమని ఏఐసీసీ ఆంటోనీ కమిటీ రిపోర్టు ఇచ్చింది. దీనిపై ఏఐసీసీలో చర్చపెడితే మన్మోహన్ సింగ్ కంటతడి పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు' అని హరీశ్ రావు గుర్తుచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.