Bandi Sanjay: తెలంగాణ బీజేపి అధ్యక్షుడి హోదాలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్

బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కరీంనగర్ ఎంపి బండి సంజయ్ (Bandi Sanjay).. ''సామాన్య కార్యకర్తను అయిన తనకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు చెబుతున్నాను'' అని అన్నారు. 

Last Updated : Mar 11, 2020, 08:50 PM IST
Bandi Sanjay: తెలంగాణ బీజేపి అధ్యక్షుడి హోదాలో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్

హైదరాబాద్ : బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కరీంనగర్ ఎంపి బండి సంజయ్ (Bandi Sanjay).. ''సామాన్య కార్యకర్తను అయిన తనకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు చెబుతున్నాను'' అని అన్నారు. ఇప్పటికే తెలంగాణలో బీజేపిని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రజలు భావిస్తున్నారు. పార్టీకి గ్రామస్థాయిలో, బూత్ స్థాయిలో కార్యకర్తలు ఉన్నారు. అందుకే గత ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు గెలిచాము అని బండి సంజయ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపి సత్తా చాటాము. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్తామని చెబుతూ.. టీఆర్ఎస్‌కి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదని.. బీజేపీనే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని బండి సంజయ్ ధీమా వ్యక్తంచేశారు. 

అందరం కలిసి పనిచేస్తాం:
పార్టీలో నేతలు అందరితో సహకారం లభిస్తుందా లేదా అనే ప్రశ్నకు బండి సంజయ్ స్పందిస్తూ.. '' పార్టీలో సీనియర్లు, జూనియర్లు అంటూ ఎవరూ లేరని... అందరం పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసే వారమే'' అని పేర్కొన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. సమిష్టి నిర్ణయాలతో ముందుకెళ్తాము అని చెబుతూ నేతలు అందరూ సమానమేననే సందేశాన్ని ఇచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News