కోటి బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం

పంపిణీకి సిద్ధమైన కోటి బతుకమ్మ చీరలు

Last Updated : Sep 19, 2019, 06:25 PM IST
కోటి బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం

హైదరాబాద్: తెలంగాణలో పల్లెపడుచులు సంబరంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు పంపిణీ చేసేందుకు కోటి చీరలు సిద్ధమయ్యాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నెల 23 నుంచి కోటీ చీరలను పంపిణీ చేస్తామని, ఈ సారి బతుకమ్మ చీరలు 10 రకాల డిజైన్స్‌తో, 10 రకాల కలర్లతో నేయించామన్నారు. కొన్ని సలహాలు, సూచనల మేరకు 10 లక్షల చీరలను 9 మీటర్ల పొడవు, మిగతా 90 లక్షల చీరలు 6 మీటర్ల పొడుగుతో తయారు చేయించినట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మాసాబ్‌ట్యాంక్ CDMA ( కమిషనర్ & డైరెక్టర్ మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ ) కార్యాలయంలో బతుకమ్మ చీరల ప్రదర్శనలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం రూ.313 కోట్లు ఖర్చు చేసిందన్నారు. 16 వేల మంది నేతన్నలు, 26 వేల మగ్గాలపై ఎంతో కష్టపడి ఈ చీరలను నేశారని చెప్పిన కేటీఆర్... ఇదివరకు నెలకు రూ 7వేల నుండి 12 వేల వరకు సంపాదించిన నేతన్నలు ఇప్పుడు రూ 16 వేల నుండి రూ 20 వేల వరకు సంపాదిస్తున్నారని అన్నారు. బతుకమ్మ చీరల తయారీతో నేతన్నలకు ఉపాధి లభించడమే కాకుండా వారి ఆదాయం కూడా పెరిగిందన్నారు.

Trending News