Minister KTR Gets Invitation From USA: గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుతమైన వ్యవసాయ ప్రగతి ప్రస్థానాన్ని వివరించాలని కోరుతూ మంత్రి కె. తారక రామారావుకి ఒక అంతర్జాతీయ స్థాయి ప్రఖ్యాత ఆహ్వానం అందింది.
MH CREDAI Delegates Visits Hyderabad: హైదరాబాద్ నగరం ప్రగతిపై వారికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వం గత పది సంవత్సరాలలో చేపట్టిన ప్రణాళిక బద్ధమైన కార్యక్రమాలను మహారాష్ట్ర క్రెడాయ్ ప్రతినిధుల బృందానికి మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రస్తావించిన అంశాల్లోంచి పలు ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
KTR speech at Davos WEF: హైదరాబాద్ నగరం లైఫ్ సైన్సెస్‌కు క్యాపిటల్‌గా ఉందని, ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఫార్మాసిటీ పేరుతోప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ని హైదరాబాద్ శివారుల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
KTR In London Trip: బ్రిటన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మూడో రోజు కూడా బిజీ బిజీగా గడిపారు. పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. పలు సమావేశాల్లో పాల్గొన్నారు. లండన్‌లోని రాయబార కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
KTR Criticise BJP Leader Etela Rajender: ఒకవేళ గతంలోనే ఈటల రాజేందర్ ఆత్మగౌరవం దెబ్బతిని ఉంటే, ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్ర మంత్రి పదవిలో ఎలా కొనసాగారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌ది ఆత్మ గౌరవం కాదని, ఆత్మ వంచన అని వ్యాఖ్యానించారు.
ట్విట్టర్ వేదికపై యాక్టివ్ గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. ఓ సభలో తన ఫోటో తీసిన చిన్నారిని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ కేటీఆర్ మనస్సు దోచుకున్న ఆ చిన్నారి ఎవరు..
తెలంగాణలో రెండవ ఐటీ హబ్ రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ ఇతరప్రాంతాల్లో సైతం ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఎటువంటి ఆహ్వానం అందకుండానే మంత్రి కేటీఆర్ అక్కడకు వెళ్లారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఘాటైన రిప్లై ఇచ్చారు. తనకు ప్రపంచ ఆర్థిక సదస్సు నుంచి అందిన ఆహ్వానం లేఖలని జతపరుస్తూ ఓ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్ లోనే కాంగ్రెస్ నేతకు ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ గారూ.. తానేమీ పప్పుని కాదని, హుందాగా మీ ( ఉత్తమ్ కుమార్ రెడ్డి) తప్పు మీరు తెలుసుకుని సరిదిద్దికుంటారని ఆశిస్తున్నానని మంత్రి కేటీఆర్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ని పలు టీవీ ఛానెల్స్ అయోమయానికి గురిచేశాయి. నేడు గుజరాత్, హిమాచల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జరుగుతుండటంతో కౌంటింగ్ అప్ డేట్స్, ప్రత్యక్ష ప్రసారాల కోసం యావత్ దేశం ఉదయం నుంచే టీవీలకి అతుక్కుపోయింది. అలాగే మంత్రి కేటీఆర్ కూడా టీవీ ముందు కూర్చుని గుజరాత్ లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై అదే పనిగా పరిశీలించడం మొదలుపెట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.