Raj Gopal Reddy Clarity On Joining In Congress: తెలంగాణలో బీజేపీని బలహీనం చేసే కుట్రలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తాను బీజేపీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆ ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతానని తాను ఎక్కడా అనలేదని క్లారిటీ ఇచ్చారు. గత ఆరు నెలల నుంచి తన పని తాను చేసుకుంటున్నానని.. బీజేపీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
'ఎందుకు నాపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. సోనియాగాంధీ రాహుల్ గాంధీ మీద అభిమానం ఉంది. పార్టీకి పదవికి రాజీనామా చేసి ప్రజల సమక్షంలో బీజేపీలో చేరాను. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి నాపై విపరీతమైన కుతంత్రాలు చేశారు. కేసీఆర్ అవినీతి డబ్బుతో మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచారు. మునుగోడు ఎన్నికలు నైతిక విజయం నాదే అని అందరికీ తెలుసు. సమాచారం చట్టం హక్కుని వాడుకొని బ్లాక్ మెయిల్ చేసి కోట్లు సంపాదించారు రేవంత్ రెడ్డి. కుటుంబ పాలన నియంత పోవాలని ప్రజల కోసం పోరాటం చేశాను. తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్‌లో పోరాడాను.
కర్ణాటక ఎన్నికల తర్వాత నా పాత మిత్రులు కాంగ్రెస్ వాళ్లు ఫోన్ చేసి కాంగ్రెస్‌కి రమ్మని అడుగుతున్నారు. తెలంగాణ ప్రజలు దుబ్బాక, హైదరాబాద్ మేయర్ ఎన్నికలు, హుజురాబాద్ ఎన్నికల్లో క్లియర్ మెజార్టీతో బీజేపీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏందో వారికి తెలియదు.. అందరూ పాదయాత్రలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి అంటగట్టి ఎందుకు నా మీద మీడియా కథనాలు వస్తున్నాయని తెలియడం లేదు. డబ్బు కోసం పార్టీలు మారాల్సిన అవసరం నాకు లేదు. పారదర్శకంగా మాకు గ్లోబల్ టెండర్ వచ్చింది. బీజేపీ మీద నమ్మకం ప్రదానిపై నమ్మకంతోనే పార్టీలో చేరా. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉంది.. ప్రజలు అనుకున్నకా నాయకులు ఆటోమేటిక్‌గా పార్టీలోకి వస్తారు. బీజేపీకి బండి సంజయ్ అధ్యక్షుడిగా మూడు సంత్సరాలుగా కొనసాగుతున్నారు. కేంద్ర నాయకత్వం అనుకుంటే ఆయననే మళ్లీ కొనసాగిస్తారు..' అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
తన 55 ఏళ్ల జీవితంలో ఎప్పుడు తప్పుచేయలేదని ఆయన అన్నారు. డబ్బు, అధికారం కోసం అమ్ముడుపోయే వ్యక్తిని తాను కాదని.. రాజకీయంగా తనను ఎదుర్కోలేకే దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తనకు పదవులు ముఖ్యం కాదని అన్నారు. ఇలాంటి ప్రచారాలకు తాను భయపడే వ్యక్తిని కాదని అన్నారు.
Also Read: Amazon Shopping: అమెజాన్ వినియోగదారులకు షాక్.. ఈ వస్తువులపై ధరల పెంపు..?
Also Read: Cabinet Meeting: కొత్త సచివాలయంలో తొలిసారి కేబినెట్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి