Farmer laws: వాళ్లంతా రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు: కిషన్ రెడ్డి

Farmer laws: వ్యవసాయచట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె, భారత్ బంద్ పై బీజేపీ స్పందించింది. కొన్ని రాజకీయపార్టీలు స్వార్ధం కోసం రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని విమర్శిస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారంటే..

Last Updated : Dec 7, 2020, 11:40 PM IST
Farmer laws: వాళ్లంతా రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు: కిషన్ రెడ్డి

Farmer laws: వ్యవసాయచట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె, భారత్ బంద్ పై బీజేపీ స్పందించింది. కొన్ని రాజకీయపార్టీలు స్వార్ధం కోసం రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని విమర్శిస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారంటే..

కేంద్ర ప్రభుత్వం ( Central Government ) తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు ( Farm laws ) వ్యతిరేకంగా రైతుల సమ్మె జరుగుతోంది. రేపు భారత్ బంద్ జరగనుంది. భారత్ బంద్ ( Bharat Bandh ) కు విపక్షపార్టీలు మద్దతిస్తున్నాయి. దీనిపై బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ( Central minister Kishan reddy ) ఈ వ్యవహారంపై మాట్లాడారు. కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని విమర్శించారు. రైతులు స్వేచ్ఛంగా తమ పంటల్ని లాభసాటి ధరలకు అమ్ముకునేలా చట్టం తెచ్చిందని అన్నారు.  

వ్యవసాయ చట్టాల ద్వారా కేంద్రం రైతుల పంటల అమ్మకంపై ఉన్న ఆంక్షలు తొలగించిందన్నారు. కనీస మద్దతు ధర విషయంలో ఎలాంటి మార్పు చేయలేదని చెప్పారు. రైతు చట్టాలపై రాజకీయం చేస్తూ..రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అటు పంటల భీమా పధకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ( TRS Government ) నిర్వీర్యం చేసిందన్నారు. రైతులకు వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాల్లో ఒక్క పదం కూడా లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. రైతుల్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. Also read: CM KCR: అన్నదాతలందరికీ ‘రైతుబంధు’ సాయం అందాలి

Trending News