Revanth Vs DK Aruna: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ. సీఎంకు పోయే కాలం దగ్గరపడిందన్నారు. కొడంగల్ ఏమైనా రేవంత్ అయ్య జాగీరా అని ప్రశ్నించారు. అందుకే నియంతలా వ్యవహరిస్తున్నాడని విరుచుకుపడ్డారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని విమర్శలు చేశారు.
ఒక కుటుంబ పాలన పోయిందనుకుంటే ఇంకో కుటుంబ పాలన వచ్చిందన్నారు. అధికారం చేతిలో ఉంది ఏదైనా చేసేస్తా అంటే ఊరుకోబోమన్నారు. నియంతలా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డికి సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన చేస్తున్న రేవంత్‌రెడ్డి దిగిపోవాలన్నారు. ఒక ఎంపీగా తన నియోజకవర్గానికి చెందిన ప్రజల దగ్గరకు పోకుడదా అని ప్రశ్నించారు. తనను అడ్డుకునే హక్కు రేవంత్‌రెడ్డికి ఎక్కడ ఉందన్నారు.
నార్సింగి పీఎస్ నుంచి విడుదలైన అనంతరం ఎంపీ ఈటల, బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. లగచర్ల వెళుతున్న తనను అడ్డుకోవడంపై మండిపడ్డారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ సొంత ఇలాకా అయిన లగచర్లలో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తుండటంపై అక్కడ ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే కదా. ఫార్మా సిటీతో ఇక్కడ లోకల్ గా ఉన్న ఉద్యోగాలు వస్తాయని అంటుంటే.. కాదు కాదు.. ఫార్మా సిటీ వల్ల పచ్చగా ఉండే మా ఊరు కలుషితం అవుతుందని రోడ్డుకెక్కారు. ఇలా ఎవరి వాదనలు వారు చేస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్రం అభివృద్ది పథంలో సాగాలంటే కంపెనీలు రావాల్సిందే. ఒక ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసినా.. కాలష్యం తక్కువ ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకొని కంపెనీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter.