Vijaya Sankalpa Sabha: అమిత్ షా సభకు లక్ష మందితో జన సమీకరణ.. బండి సంజయ్ భారీ యాక్షన్ ప్లాన్

Amit Shah Meeting In Chevella: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా టూర్‌ను సూపర్ సక్సెస్ చేసేందుకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం రెడీ అవుతోంది. ఈ మేరకు నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు బండి సంజయ్. చేవెళ్ల సభకు భారీ జనసమీకరణ చేయాలని పిలుపునిచ్చారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 22, 2023, 01:14 PM IST
  • విజయ సంకల్ప సభ ఓ సంచలనం కావాలి
  • లక్ష మందికి తగ్గకుండా జన సమీకరణ
  • బీజేపీ నేతలకు బండి సంజయ్ పిలుపు
Vijaya Sankalpa Sabha: అమిత్ షా సభకు లక్ష మందితో జన సమీకరణ.. బండి సంజయ్ భారీ యాక్షన్ ప్లాన్

Amit Shah Meeting In Chevella: కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. విజయ సంకల్ప సభకు భారీగా ప్రజలు హాజరయ్యేలా చూస్తున్నారు. రేపు చేవెళ్లలో జరగబోయే విజయ సంకల్ప సభ తెలంగాణలో సంచలనం కావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ సభకు లక్ష మందికి తగ్గకుండా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని అన్నారు. కార్యకర్తలంతా స్వచ్ఛందంగా ఈ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమనే సంకేతాలను ఈ సభ ద్వారా పంపాలంటూ పార్టీ నేతలకు సూచించారు. శనివారం జిల్లా అధ్యక్షులు, పార్టీ రాష్ట్ర నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఆదివారం చేవెళ్లలో జరగబోయే బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్న నేపథ్యంలో సభ విజయవంతానికి  ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త కృషి చేయాలన్నారు బండి సంజయ్. పార్లమెంట్ పరిధిలో జరగబోయే తొలి సభను సక్సెస్ చేయడం ద్వారా తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమనే నమ్మకాన్ని జాతీయ నాయకత్వానికి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో నియంత, నిక్రుష్ణ, అవినీతి పాలన కొనసాగుతోందని విమర్శించారు. కేసీఆర్ వల్ల కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలంతా బీజేపీ పట్ల నమ్మకంతో ఉన్నారని.. ఈ నేపథ్యంలో పార్టీని అణిచివేసేందుకు సీఎం కేసీఆర్ రాబోయే రోజుల్లో కార్యకర్తలను మరింత ఇబ్బందికి గురిచేసే ప్రమాదం ఉందని బండి సంజయ్ అన్నారు. అయినా ప్రజలు, పార్టీ అండగా ఉన్నందుకు కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. 

Also Read: Harish Rao Letter: మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయొద్దు.. కేంద్రానికి హరీష్ రావు లేఖ  
 
కేంద్రంలో నరేంద్రమోదీ ఆధ్వర్యంలో అవినీతిరహిత పాలన కొనసాగుతోందన్నారు బండి సంజయ్. తెలంగాణలోనూ అలాంటి పాలనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. చేవెళ్ల సభ ద్వారా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. రామరాజ్య స్థాపన తథ్యమనే సంకేతాలను పంపబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ సభను సక్సెస్ చేయాలని కోరుతూ ప్రతి ఒక్కరూ మీడియా, సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు.

Also Read: LSG vs GT Dream11 Tips: గుజరాత్ టైటాన్స్‌తో లక్నో ఢీ.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీకోసం..   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News