రక్తాన్ని ఎందుకు జల్లారు.. ఏదైనా క్షుద్రపూజా..!

తెలంగాణకు చెందిన సూర్యాపేట జిల్లాలో ఓ చిత్రమైన ఘటన చోటు చేసుకుంది. 

Last Updated : Jan 22, 2018, 12:53 PM IST
రక్తాన్ని ఎందుకు జల్లారు.. ఏదైనా క్షుద్రపూజా..!

తెలంగాణకు చెందిన సూర్యాపేట జిల్లాలో ఓ చిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చివ్వెం మండలం రోళ్లబండా తండాలో ప్రవేశించి ప్రతీ ఇంటి వద్దకు వచ్చి రక్తాన్ని ఒలకబోసినట్లు తెలుస్తోంది. ఉదయం లేవగానే గ్రామస్థులు తమ ఇంటి ముందు రక్తం ఉండడం చూసి భయాందోళలను లోనయ్యారు.

దాదాపు గ్రామంలోని ప్రతీ ఇంటి దగ్గర రక్తం జల్లడంతో ఈ సంఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. తండాలో గుడిసెలు, పెంకిటిల్లులు ఎక్కువగా ఉండగా.. అదే ప్రాంతంలో ఉన్న పక్కా ఇళ్లను కూడా ఆగంతకులు వదల్లేదు. ఆ ఇండ్ల మేడa మీదకు కూడా రక్తం ప్యాకెట్లను విసరడంతో ఆ సంఘటన ఇప్పుడు అనేక చర్చలకు దారి తీస్తోంది. గ్రామానికి ఏదో అరిష్టాన్ని కలిగించేందుకు గిట్టనివారెవరో ఈ పని చేసుంటారని కొందరు అంటుంటే.. కొన్ని రకాల క్షుద్రపూజలు చేసేటప్పుడు మంత్రగాళ్లు ఇలాంటి పద్ధతులు అనుసరిస్తారని కూడా అంటున్నారు.

ప్రస్తుతం ఆ తండావాసులు భయం భయంగా తమకు ఏమవుతుందా అన్న మీమాంసలో ఉన్నారు. అయితే ఇలాంటి పుకార్లను నమ్మవద్దని హేతువాదులు చెబుతున్నారు. కొన్నిసార్లు గ్రామాల్లో భయందోళనలు కలిగించడానికి కొందరు ఆకతాయిలు ఇలాంటి పనులు చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది

Trending News