BRS First Public Meeting: ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామపంచాయితీకి రూ. 10 లక్షల నిధులు: సీఎం కేసీఆర్

CM KCR says BRS Govt to Release Rs. 10 lakh fund to Every Gram Panchayat in Khammam. ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామపంచాయితీకి రూ. 10 లక్షల నిధులు కేటాయించామని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ చెప్పారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 18, 2023, 05:47 PM IST
  • ఖమ్మంలోని ప్రతి గ్రామపంచాయితీకి రూ. 10 లక్షల నిధులు
  • ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ
  • బీజేపీపై విమర్శల వర్షం
BRS First Public Meeting: ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామపంచాయితీకి రూ. 10 లక్షల నిధులు: సీఎం కేసీఆర్

Telangana CM KCR Speech at BRS Khammam Public Meeting: జాతీయ పార్టీగా అవతరించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తొలి బహిరంగ సభ ఖమ్మం జిల్లాలో అట్టహాసంగా జరుగుతోంది. ఈ బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్రెసిడెంట్, సీఎం కేసీఆర్‌ సహా పంజాబ్ సీఎం భగవంత్‌మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, పలువురు జాతీయ నేతలు ఈ సభకు హాజరయ్యారు. పంజాబ్, ఢిల్లీ, కేరళ సీఎంలు మాట్లాడుతూ బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. 
 
ఖమ్మం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ... 'ఖమ్మంలో బీఆర్ఎస్ సభ దేశంలో ప్రబలమైన మార్పునకు సంకేతం. లక్షల కోట్ల ఆస్తి మన దేశ ప్రజల సొత్తు.. కానీ ఇంకా యాచకులుగానే మిగిలిపోయాం. అద్భుతమైన పంటలు పండే అవకాశం ఉన్నా.. కొన్ని ఆహార ఉత్పత్తులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దేశంలో ప్రజల కష్టాలను తీర్చడానికే బీఆర్ఎస్ పుట్టింది. రూ.11 లక్షల కోట్ల నుంచి రూ.14 లక్షల కోట్లను ఎన్‌పీఏల పేరుతో నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతోంది. దేశంలో అనేక దుర్మార్గాలకు కాంగ్రెస్, బీజేపీనే కారణం. బీఆర్ఎస్ లాంటి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటే.. రెండేళ్లలో వెలుగు జిలుగుల భారత్ తయారయ్యేది' అని అన్నారు.

ఖమ్మం జిల్లాకు తెలంగాణ సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. 589 గ్రామాలకు రూ. 10 లక్షల (ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామపంచాయితీకి రూ. 10 లక్షల నిధులు) చొప్పున ప్రకటించారు. ఖమ్మం మున్సిపాలిటీకి రూ.50 కోట్లు సీఎం మంజూరు చేశారు. ఇక మధిర, వైర, సత్తుపల్లి మున్సిపాలిటీలకు రూ. 30 కోట్లు ఇస్తునట్టు తెలిపారు. మున్నేరు నదిపై వంతెన మంజూరు చేశారు. జర్నలిస్టులకు ఖమ్మం జిల్లా కేంద్రంలో నెల లోగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. 

Also Read: Bhadra Rajyog 2023: అరుదైన భద్ర రాజయోగం.. ఈ రాశుల వారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు! వివాహం జరిగే అవకాశం  

Also Read: Rohit Sharma Record: ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News