Bhatti Comments: వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. తాజా రాజకీయాల పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు రెండురోజులపాటు చింతన్ శివిర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కీసర వేదికగా పార్టీ నేతల మేథోమధన కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతోపాటు తీర్మానాలు చేయనున్నారు.
ఇప్పటికే ఆరు కమిటీలను అంశాల వారీగా ఏర్పాటు చేశారు. కమిటీల నివేదికలపై చింతన్ శివిర్‌లో చర్చించనున్నారు. అనంతరం ఓ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. రాజస్థాన్ ఉదయ్ పూర్ చింతన్ శివిర్ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. చింతన్ శివిర్‌లో కాంగ్రెస్ అధిష్టాన దూతలతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఆ పార్టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి విదేశాల్లో ఉండటంతో ఆయన దూరంగా ఉన్నారు.
ఈసందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి విషయంలో ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేశారు. కొన్ని కారణాల వల్ల ఆయన విదేశాలకు వెళ్లారని చెప్పారు. ముందుస్తుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ వల్లే రేవంత్ హాజరుకాలేదని తేల్చి చెప్పారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌పై రెండురోజులపాటు చర్చిస్తామన్నారు. తెలంగాణ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నివేదిక తయారు చేసి ఏఐసీసీకి పంపుతామని చెప్పారు.
ఈకార్యక్రమంలో మొత్తం ఆరు అంశాలపై చర్చిస్తామని వెల్లడించారు. తెలంగాణలో రాజకీయ, ఆర్థిక అంశాలపై ఆరు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. చింతన్ శివిర్‌లో తీసుకున్న నిర్ణయాలు..రాబోయే ఎన్నికలకు రోడ్ మ్యాప్ అని స్పష్టం చేశారు. ఇక ముందు జిల్లాల వారిగా చింతన్ శివిర్ నిర్వహిస్తామన్నారు భట్టి విక్రమార్క. ఉదయ్ పూర్ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
Also read:Supreme Court: రుషి కొండ నిర్మాణాలకు రైట్ రైట్..సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు..!
Also read:Pawan Kalyan: దిగ్భ్రాంతికరం... సింగర్ కృష్ణకుమార్ కున్నత్ హఠాన్మరణం బాధ కలిగించింది...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook