Raithu Bandhu: 19 లక్షల ఎకరాలకు రైతు బంధు కట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..

Raithu Bandhu: రైతు పెట్టుబడులకు భరోసాగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధుపై కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.  ఈనేపథ్యంలో రైతు పెట్టుబడి రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Written by - Renuka Godugu | Last Updated : Feb 11, 2024, 07:40 AM IST
Raithu Bandhu: 19 లక్షల ఎకరాలకు రైతు బంధు కట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..

Raithu Bandhu: రైతు పెట్టుబడులకు భరోసాగా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధుపై కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.  ఈనేపథ్యంలో రైతు పెట్టుబడి రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సాగు చేసే రైతులకే రైతుబంధు వర్తిస్తుందని సీఎం ప్రకటించారు. వ్యవసాయం చేయని భూ యజమానులకు పెట్టుబడి సహాయం ఇవ్వమని ఆయన అన్నారు. అంటే ఇకపై అన్నీ భూములకు రైతుబంధు సాయం అందదు. కేవలం వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందుతుంది. ఈ సందర్భంగా సంబంధిత అధికారలు కూడా క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టనున్నారు.

ఇదీ చదవండి: ప్రజల్లారా ఈ 'బడ్జెట్‌'తో 6 గ్యారంటీలు రావు.. ఆశలు పెట్టుకోవద్దని హరీశ్‌ రావు సూచన

రియల్‌ ఎస్టేట్‌ భూములు, అనర్హులకు రైతు భరోసా ఇవ్వమని తేల్చి చెప్పారు సీఎం. సాగు చేసే రైతులకు అందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైతుల రుణాలు మాఫీ చేస్తామని, బ్యాంకర్లతో చర్చలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, 19 లక్షల ఎకరాలు సాగులో లేని జాబితాలో ఉన్నాయి. దీంతో ఏడాదికి రూ.1,900 కోట్ల నిధులు ఆదా అవుతాయి. ఈనేపథ్యంలో నిన్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 కి గాను 2,75,891 కోట్లు కేటాయించారు. అందులో వ్యవసాయ శాఖకు 19746 కోట్లు కేటాయించారు.

ఇదీ చదవండి:  దిమాక్ నెత్తిలో ఉందా.. మోకాళ్లలో జారిపోయిందా..?.. సీఎం రేవంత్ పై ఫైర్ అయిన మాజీ మంత్రి కేటీఆర్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News