Bandi Sanjay: యాత్రపై రాళ్లు రువ్విన కాంగ్రెస్‌ శ్రేణులు.. తాట తీస్తానని బండి సంజయ్‌ హెచ్చరిక

Prajahita Yatra: కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ చేపట్టిన ప్రజాహిత యాత్రకు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు అడ్డంకులు సృష్టించారు. రాళ్లు రువ్వడంతో పరస్పరం ఘర్షణకు దారి తీసింది. దీంతో స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్‌పై బండి సంజయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 28, 2024, 10:50 AM IST
Bandi Sanjay: యాత్రపై రాళ్లు రువ్విన కాంగ్రెస్‌ శ్రేణులు.. తాట తీస్తానని బండి సంజయ్‌ హెచ్చరిక

Bandi Sanjay Yatra: కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ ప్రజాహిత యాత్ర కొనసాగిస్తున్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో యాత్రకు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు అడ్డంకులు సృష్టించారు. యాత్రపై రాళ్లు రువ్వుతూ దాడులకు పాల్పడ్డారు. బీజేపీ ఫ్లెక్సీలు చింపివేస్తూ, బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. దీంతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య సంజయ్ యాత్ర కొనసాగింది. శాంతియుతంగా చేస్తున్న యాత్రను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని సంయ్‌ హెచ్చరించారు. తాను ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని ఈ సందర్భంగా సంజయ్‌ స్పష్టత నిచ్చారు.

Also Read: KT Rama Rao: మార్చి 1న మేడిగడ్డ పోతాం.. కాళేశ్వరంపై రేవంత్‌ దుష్ప్రచారం నిరూపిస్తాం

తన యాత్రపై రాళ్లు రువ్విన కాంగ్రెస్‌ పార్టీ తీరుపై సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాహిత యాత్రకు అడ్డంకులు సృష్టిస్తూ.. అరాచకాలు చేస్తున్న పొన్నం ప్రభాకర్‌కు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. 'కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్దికి ఏం చేశానో వివరిస్తూ ఎన్నికల్లోకి వెళ్తున్నా. మీకు దమ్ముంటే మీరు ఏం చేశారో చెప్పి ఎన్నికల్లోకి వెళ్లండి' అని సవాల్‌ విసిరారు. 'కరీంనగర్‌లో ఎంపీగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా' అని సంజయ్‌ సంచలన ప్రకటన చేశారు.

Also Read: 500 LPG Scheme: నేడు ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాలు ప్రారంభించనున్న సీఎం రేవంత్..

'అదే కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోతే.. పొన్నం ప్రభాకర్‌ మంత్రి పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధమా? దమ్ముంటే ఈ సవాల్‌ను స్వీకరించాలి’ అని బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం రాక ప్రశాంతంగా సాగుతున్న ప్రజాహిత యాత్రను అడ్డుకుంటున్నారని విమర్శించారు. పొన్నం ప్రభాకర్‌ విధ్వంసాలకు పాల్పడుతూ అరాచకాలు సృష్టిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తేలా చూస్తున్నారని మండిపడ్డారు.  దగ్దం చేస్తున్న విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. అట్లాగే  పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు, ప్రజాహిత యాత్రను కాంగ్రెస్ అడ్డుకోనేందుకు చేస్తున్న యత్రాలను మీడియా ప్రస్తావించడంతో బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఆయనేమన్నారంటే....

'వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పారు. 80 రోజులైనా ఎందుకు అమలు చేయడం లేదు?' అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. 6 గ్యారంటీలను, మేనిఫెస్టోలోని 423 హామీలను అమలు చేయకుంటే తాటతీస్తామని హెచ్చరించారు. 'నరేంద్రమోదీ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా బియ్యం ఇస్తుంటే రేషన్ షాపుల మద్ద సీఎం ఫొటోలు పెట్టుకోవడమేమిటి? ప్రధాని ఫొటో ఎందుకు పెట్టడం లేదు?' అని ప్రశ్నించారు. పోలీసుల బందోబస్తు నడుమ బండి సంజయ్‌ 'ప్రజాహిత యాత్ర' ప్రశాంతంగా జరుగుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News