కరోనాతో కానిస్టేబుల్ మృతి..

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా కేసులు రోజు రోజుకు భయంకరంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా రోజుకు 5 వేల కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. 

Updated: May 21, 2020, 05:14 PM IST
కరోనాతో కానిస్టేబుల్ మృతి..

హైదరాబాద్: ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా (Covid-19) కేసులు రోజు రోజుకు భయంకరంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా రోజుకు 5 వేల కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ కరోనా విలయతాండవం ప్రదర్శిస్తోంది. కాగా తెలంగాణలో కోవిడ్ బారిన పడి ఓ పోలీస్ కానిస్టేబుల్ మరణించిన సంఘటన యావత్తు రాష్ట్రాన్ని కలిచి వేస్తోంది. కానిస్టేబుల్ మృతిపై పోలీసు శాఖ, తెలంగాణ ప్రభుత్వం సంతాపం వ్యక్తం చేసింది. 

Also Read:  హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఘోర రోడ్డుప్రమాదం..

పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కానిస్టేబుల్ 2007బ్యాచ్ కు చెందిన దయాకర్ రెడ్డి (37) కొద్ది రోజుల క్రితం అతడు అనారోగ్యానికి గురికావడంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలిందని, దీంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే దయాకర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కరోనా వైరస్ సోకి గత రాత్రి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో దయాకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ చనిపోయినట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ట్వీట్ చేశారు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కానిస్టేబుల్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ పోలీస్ శాఖ అండగా ఉంటుందని డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్ లో పేర్కొన్నారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్

Read Also: 36-24-36తో సెగలు రేపుతోన్న అందం