Coronavirus cases in Telangana: తెలంగాణలో తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు

COVID-19 cases in Telangana : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో తాజాగా 44,310 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. వారిలో 196 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. మరో 1543 మందికి సంబంధించిన కొవిడ్-19 రిపోర్ట్స్ రావాల్సి ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2021, 02:12 AM IST
Coronavirus cases in Telangana: తెలంగాణలో తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు

COVID-19 cases in Telangana : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో తాజాగా 44,310 మందికి కరోనావైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. వారిలో 196 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. మరో 1543 మందికి సంబంధించిన కొవిడ్-19 రిపోర్ట్స్ రావాల్సి ఉంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనవైరస్ పాజిటివ్‌ కేసులు సంఖ్య మొత్తం 6,68,266కు చేరింది. అలాగే గత 24 గంటల వ్యవధిలో కరోనా వైరస్ కారణంగా ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌తో (COVID-19 death toll in Telangana) మృతి చెందిన వారి సంఖ్య మొత్తం 3,933 కి పెరిగింది. 

హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం రాష్ట్రంలో తాజాగా మరో 201 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 6,60,143 కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 4,190 యాక్టివ్‌ కరోనావైరస్ పాజిటివ్ కేసులు (Coronavirus positive cases) ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

Also read : Gangula Kamalakar Tested Positive: కరోనా బారినపడ్డ మరో తెలంగాణ మంత్రి

తెలంగాణలో కరోనావైరస్ (Telangana COVID-19 cases) రికవరీ రేటు విషయానికొస్తే... ప్రస్తుతం దేశంలో రికవరి రేటు 98.01 శాతంగా ఉండగా తెలంగాణలో అది 98.78 శాతంగా నమోదైంది.

Also read : Huzurabad bypolls: ఈటల రాజేందర్‌పై కేసు నమోదు.. వేడెక్కుతున్న హుజూరాబాద్ రాజకీయం

Also read : టెన్త్ పరీక్షల్లో 'ఆరు' పేపర్లే...కేసీఆర్ సర్కారు కీలక ఉత్తర్వులు

Trending News