Telangana Covid-19: కొత్తగా 837 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో రెండు రోజల నుంచి కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల 1500లకు చేరువలో నమోదైన కేసులు.. ప్రస్తుతం సగానికి సగం తగ్గాయి. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే... రాష్ట్రంలో కేసుల కన్నా.. కరోనా రికవరీ రేటు సంఖ్య ప్రతిరోజూ గణనీయంగా పెరుగుతూనే ఉంది.

Last Updated : Oct 27, 2020, 09:19 AM IST
Telangana Covid-19: కొత్తగా 837 కరోనా కేసులు

Telangana Coronavirus Updates: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో రెండు రోజల నుంచి కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల 1500లకు చేరువలో నమోదైన కేసులు.. ప్రస్తుతం సగానికి సగం తగ్గాయి. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే... రాష్ట్రంలో కేసుల కన్నా.. కరోనా రికవరీ రేటు సంఖ్య ప్రతిరోజూ గణనీయంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో సోమవారం ( అక్టోబరు 26 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణలో కొత్తగా 837 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నలుగురు (4) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,32,671 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,315 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ (Telangana) వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.  Also read: West Bengal: దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో అపశ్రుతి

ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 1,554 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,13,466 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 17,890 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 91.14 శాతం ఉండగా.. మరణాల రేటు 0.56 శాతం ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.  Also read: Weather updates: 29న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం 

తెలంగాణ వ్యాప్తంగా సోమవారం 21,099 కరోనా పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు (అక్టోబరు 26వరకు) మొత్తం 41,15,516 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 185 కేసులు నమోదు కాగా.. ఖమ్మం జిల్లాలో 76 కేసులు, రంగారెడ్డి జిల్లాల్లో 59 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు..

telangana corona cases bulletin

Also Read | Covid-19 Vaccine: హైదరాబాద్ నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ పేస్-3 ట్రయల్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News