Telangana Coronavirus Updates: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. అయితే కొన్ని రోజులు కేసులు తగ్గడం.. ఆ తర్వాత పెరగడం తెలంగాణలో పరిపాటిగా మారింది. రెండురోజుల క్రితం ఆరు ఏడు వందలకే పరిమితమయిన కేసులు మళ్లీ 1500ల మార్క్ దాటుతున్నాయి. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో కరోనా కేసుల కన్నా.. రికవరీ రేటు క్రమంగా పెరుగుతుండటంతోపాటు.. మరణాలు కూడా చాలా తక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కరోనా రికవరీ రేటు 91.65 శాతం ఉండగా.. మరణాల రేటు 0.56 శాతం ఉంది.
అయితే గత 24 గంటల్లో గురువారం ( అక్టోబరు 29 రాత్రి 8 గంటల వరకు ) తెలంగాణ (Telangana) లో కొత్తగా 1,531 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఆరుగురు (6) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,37,187 కి చేరగా.. మరణాల సంఖ్య 1,330 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 1,048 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 217,401 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 18,456 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. Also read: BJP workers murder: ఖండించిన ప్రధాని నరేంద్ర మోదీ
గురువారం తెలంగాణ వ్యాప్తంగా 43,790 కరోనా పరీక్షలు చేయగా.. అక్టోబరు 29 వరకు మొత్తం 42,40,748 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా.. జీహెచ్ఎంసీ పరిధిలో 293 కేసులు నమోదు కాగా.. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 120, రంగారెడ్డి జిల్లాలో 114 కేసులు నమోదు అయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కేసులు ఈ విధంగా ఉన్నాయి..
Also read : JEE Mains topper arrest: జేఈఈ మెయిన్స్ టాపర్ అరెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe