Telangana Covid-19: కొత్తగా 1,267 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి 1500లకు చేరువలో.. పైగా నమోదవుతున్న కేసులు కాస్త.. రెండు రోజుల నుంచి తగ్గాయి. ఆదివారం వేయికి తక్కువగా నమోదైన కేసులు.. సోమవారం 1300లకు చేరువలో నమోదయ్యాయి.

Last Updated : Nov 10, 2020, 09:25 AM IST
Telangana Covid-19: కొత్తగా 1,267 కరోనా కేసులు

Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి 1500లకు చేరువలో.. పైగా నమోదవుతున్న కేసులు కాస్త.. రెండు రోజుల నుంచి తగ్గాయి. ఆదివారం వేయికి తక్కువగా నమోదైన కేసులు.. సోమవారం 1300లకు చేరువలో నమోదయ్యాయి. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసులతోపాటు.. కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. అయితే గత 24 గంటల్లో సోమవారం ( నవంబరు 9న) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో కొత్తగా 1,267 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నలుగురు (4) మరణించారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 

తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,52,455 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,385 కి చేరింది. అయితే గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 1,831 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా (Telangana) కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,32,489 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 18,581 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 92.09 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. Also read: చిరంజీవికి కరోనా.. టెన్షన్‌లో సీఎం కేసీఆర్, నాగార్జున, తదితరులు!

ఇదిలావుంటే.. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా 42,490 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 9వ తేదీ వరకు మొత్తం 46,84,766 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా..  జీహెచ్ఎంసీ పరిధిలో 201 కేసులు నమోదయ్యాయి. అయితే.. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.. 

telangana corona cases bulletin
 

Trending News