Coronavirus Precautions: కరోనాపై అలసత్వం తగదు.. ఈటెల రాజేందర్

హైదరాబాద్ నగరంలో గాంధీ ఆసుపత్రిలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. కాగా నేడు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ నేడు సమావేశం అయ్యారు. కోవిడ్ -19 వ్యాప్తిని తెలంగాణలో సమర్ధవంతంగా నియంత్రిచగలిగినందుకు 

Last Updated : Mar 7, 2020, 11:42 PM IST
Coronavirus Precautions: కరోనాపై అలసత్వం తగదు.. ఈటెల రాజేందర్

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో గాంధీ ఆసుపత్రిలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. కాగా నేడు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ నేడు సమావేశం అయ్యారు. కోవిడ్ -19 వ్యాప్తిని తెలంగాణలో సమర్ధవంతంగా నియంత్రిచగలిగినందుకు కేంద్ర మంత్రి హర్ష వర్ధన్, తెలంగాణ రాష్ట్ర సీఎం కే చంద్రశేఖర్ రావు వైద్య ఆరోగ్య శాఖను అభినందించారని అన్నారు. అధికారులు, సిబ్బంది అందరికీ మంత్రి అభినందించారు. అయితే అలసత్వం వద్దని, దేశవ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో అప్రమత్తత కొనసాగించాలని ఆదేశించారు. విదేశాలనిండి రాష్టానికి వస్తున్న ప్రతి వ్యక్తిపై నిఘా పెట్టాలని కోరారు. 

అపోహలు అనుమానాల నేపథ్యంలో భరోసా కలిపించేందుకే గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ -19 పాజిటివ్ వ్యక్తి దగ్గరికి స్వయంగా వెళ్లి వచ్చానని మంత్రి అన్నారు. అతని ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నానని, వేగంగా కోలుకుంటున్నారని అయన చెప్పినట్లు మంత్రి తెలిపారు. పరీక్షల కోసం వచ్చిన పలువురి తో కూడా మంత్రి మాట్లాడారు.

విదేశాలనుండి రాష్ట్రం కి వచ్చిన ప్రతి వ్యక్తి హాస్పిటల్ కి రాకపోయినా, లక్షణాలు లేకపోయినా 14 రోజుల పాటు ఇంటివద్దే ఐసోలేషన్లో  ఉంచాలని, ప్రతి రోజూ వైద్య సిబ్బంది వారి ఇంటికి వెళ్లి పరీక్షలు నిర్వహించాలని మంత్రి కోరారు. 

ఈ సమావేశంలోనే కేంద్ర ప్రభుత్వం తరపున NCDC ప్రతినిధులు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ప్రణయ్ లతో పలు అంశాలపై మంత్రి చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. Covid-19 వైరస్ కోసం కేంద్రం రూపొందించిన నియమావళిని వారు మంత్రికి వివరించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News