Lockdown: అలా అయితే, పేదల ఖాతాల్లో రూ.5 వేలు జమ చేయండి: అసదుద్దీన్ ఒవైసి

లాక్ డౌన్‌ని మరో 15 రోజులు కొనసాగించే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి కేంద్రం ముందు పలు డిమాండ్స్ లేవనెత్తారు. ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్ డౌన్‌ని ఇంకా కొనసాగించాలని భావిస్తే.. నిరుపేదల ఖాతాల్లో రూ.5 వేల చొప్పున జమ చేయాలని డిమాండ్ చేశారు. 

Last Updated : Apr 11, 2020, 06:17 PM IST
Lockdown: అలా అయితే, పేదల ఖాతాల్లో రూ.5 వేలు జమ చేయండి: అసదుద్దీన్ ఒవైసి

హైదరాబాద్: లాక్ డౌన్‌ని మరో 15 రోజులు కొనసాగించే అవకాశం ఉందన్న సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి కేంద్రం ముందు పలు డిమాండ్స్ లేవనెత్తారు. ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్ డౌన్‌ని ఇంకా కొనసాగించాలని భావిస్తే.. నిరుపేదల ఖాతాల్లో రూ.5 వేల చొప్పున జమ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తాము కరోనా వైరస్ వల్ల చావకపోతే.. ఆకలి బాధ తట్టుకోలేకే చచ్చిపోతామేమో అనిపిస్తోంది అని నిరుపేదలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని.. వారి ఆకలి చావులను నివారించాలంటే ప్రతీ పేదోడి ఖాతాలో రూ.5 వేలు జమ చేయాలని అసదుద్దీన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 

Read Also: 15 రోజులు లాక్ డౌన్ పొడగింపు..?

ప్రధాని నన్ను ఎందుకు పిలవలేదు:
కరోనావైరస్‌పై సమీక్ష చేపట్టి లాక్ డౌన్ కొనసాగించాలా లేదా అనే విషయమై నిర్ణయం తీసుకునేందుకు ఇటీవల ప్రతిపక్షాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోదీ.. ఆ వీడియో కాన్ఫరెన్స్‌కి తనను ఆహ్వానించకుండా హైదరాబాదీలను అవమానించారని ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఒవైసి మరోసారి ఈ అంశంపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. 

Also read : POKలో ఉగ్రస్థావరాలు ఖతం

పార్లమెంట్‌లో ఏ పార్టీకి అయితే ఐదుగురు సభ్యులు ఉన్నారో.. వారిని మాత్రమే సమావేశానికి ఆహ్వానించామని చెబుతూనే ఐదుగురి కంటే తక్కువ సంఖ్య ఉన్న వారిని కూడా సమావేశానికి పిలిచారు కదా ఒవైసి ప్రశ్నించారు. ఎంఐఎంకి చెందిన తనను, ఔరంగబాద్ ఎంపీని సమావేశానికి ఆహ్వానించలేదు. అలాగే, కేరళలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలను సైతం ఈ ప్రతిపక్షాల వీడియో కాన్ఫరెన్స్‌కి ఆహ్వానించలేదని అసదుద్దీన్ గుర్తుచేశారు. దేశంలో తొలి మూడు కరోనా కేసులు కేరళలోనే వెలుగుచూశాయనే సంగతి ప్రధాని మోదీకి తెలుసా లేదా అని అసదుద్దీన్ ఒవైసి ప్రశ్నించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News