Disha Case: సిర్పుర్కర్ కమిషన్‌ నివేదిక తేటతెల్లం..పోలీసుల గుండెల్లో రైళ్లు..!

Disha Case: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన దిశా ఎన్‌కౌంటర్‌ కేసులో మరో ట్విస్ట్‌ చేటుచేసుకుంది. ఈ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమని జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్‌ స్పష్టం చేసింది. ఈమేరకు 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు ఇచ్చింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 03:01 PM IST
  • దిశా ఎన్‌కౌంటర్ కేసులో కీలక పరిణామం
  • బయటకు వచ్చిన కమిషన్‌ నివేదిక
  • అంతా బూటకమని స్పష్టం చేసిన కమిషన్
Disha Case: సిర్పుర్కర్ కమిషన్‌ నివేదిక తేటతెల్లం..పోలీసుల గుండెల్లో రైళ్లు..!

Disha Case: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన దిశా ఎన్‌కౌంటర్‌ కేసులో మరో ట్విస్ట్‌ చేటుచేసుకుంది. ఈ కేసు నిందితుల ఎన్‌కౌంటర్ బూటకమని జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ కమిషన్‌ స్పష్టం చేసింది. ఈమేరకు 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు ఇచ్చింది. దిశా ఎన్‌కౌంటర్‌ కేసులో పోలీసులను హత్యా నేరం కింద విచారణ చేయించాలని కమిషన్‌ పేర్కొంది. ఎదురుకాల్పుల్లో నిందితులు చనిపోయారంటే నమ్మే పరిస్థితి లేదని నివేదికలో కమిషన్ తేల్చి చెప్పింది.

పోలీసులు అయిన సురేందర్, నర్సింహారెడ్డి, షేక్‌లాల్ మాధర్, మహమ్మద్ సిరాజుద్దీన్, కొచ్చెర్ల రవి, వెంకటేశ్వర్లు, అర్వింద్ గౌడ్‌, జానకిరాం, బాలూ రాఠోడ్, డి. శ్రీకాంత్‌పై విచారణ చేయించాలని నివేదికలో సిర్పుర్కర్ కమిషన్ తెలిపింది.  పది మంది పోలీసులపై ఐపీసీ 302, రెడ్ విత్ 34, 201, రెడ్ విత్ 302, 34 సెక్షన్ల కింద దర్యాప్తు చేయాలని అభిప్రాయపడింది. దిశా కేసుపై సుప్రీం కోర్టు విచారణ జరిపిన కాసేపటికే నివేదిక బయటకు వచ్చింది.

సిర్పుర్కర్ కమిషన్‌ నివేదికతో పోలీసుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. విచారణను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. న్యాయవాదులను సైతం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఈకేసును హైకోర్టులోనే తేల్చుకోవాలని ఇటు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తాము మానీటర్‌ చేయలేదని..కింది స్థాయి కోర్టులో జరిగేవి తాము ఎలా చూస్తామని తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకు వెళ్లాలని తేల్చి చెప్పింది.

దిశా ఎన్‌కౌంటర్‌పై త్రిసభ్య కమిషన్‌ను సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో పర్యటించిన కమిషన్ సభ్యులు..హైకోర్టు వేదికగా విచారణ చేశారు. పోలీసులు, సాక్ష్యాలు, బాధితులను అన్ని కోణాల్లో విచారించింది. అప్పటి పోలీసు ఉన్నతాధికారులను సైతం ప్రశ్నించింది. అప్పటి సీపీ సజ్జనార్‌ను పలుమార్లు విచారించింది. దిశా ఎన్‌కౌంటర్ ప్రదేశాన్ని కమిషన్ సభ్యులు పరిశీలించారు. అక్కడి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. మూడేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టుకు కమిషన్ నివేదిక ఇచ్చింది.

Also read:Supreme Court:దిశా కేసును ప్రత్యేకంగా మానిటర్ చేయలేదు..సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..!

Also read:Telangana Govt: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్..తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News