ED Summons TRS MP Nama Nageswara Rao: టీఆర్ఎస్ నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది. జూన్ 25న విచారణకు హాజరుకావాలని బుధవారం జారీ చేసిన సమన్లలో ఎంపీ నామాను ఈడీ ఆదేశించింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని విదేశాలకు దారి మళ్లించారనే అభియోగాలకు సంబంధించిన కేసులో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు సమన్లు జారీ అయ్యాయి.
టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేత నామా నాగేశ్వర రావుతో పాటు మధుకాన్ గ్రూపు డైరెక్టర్లు, రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ డైరెక్టర్లకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి జూన్ 11న జూబ్లీహిల్స్‌లోని రోడ్ నం.19లోని ఎంపీ నామా నాగేశ్వరరావు (Nama Nageswara Rao) నివాసంతో పాటు రోడ్ నెంబర్ 36లోని మధుకాన్ కంపెనీ, రాంచీ ఎక్స్‌ప్రెస్ వే డైరెక్టర్ల నివాసాలలో, కంపెనీల ఆస్తులపై ఈడీ సోదాలు జరిపింది. పలు కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఎంపీ నామాతో పాటు మధుకాన్, రాంచీ ఎక్స్‌ప్రెస్ వే డైరెక్టర్లకు సమన్లు జారీ చేసింది.
Also Read: Nama Nageswara Rao: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇళ్లు, ఆస్తులపై ఈడీ సోదాలు
జార్ఖండ్‌లో రాంచీ - రార్‌గావ్ - జంషెడ్‌పూర్ మధ్య 163 కిలోమీటర్ల జాతీయ రహదారి-33 పనులను 2011లో మధుకాన్ గ్రూప్ దక్కించుకుంది. దాదాపు రూ.1151 కోట్ల వ్యయం అంచనా వేసిన ప్రాజెక్టు పనులను రాంచీ ఎక్స్‌ప్రెస్ వే లిమిడెట్ ఏర్పాటు చేసి ఆ సంస్థకు అప్పగించారు. అనంతరం కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,029 కోట్లు మేర పొందినట్లు సమాచారం. ఈ మొత్తం నుంచి రూ.264 కోట్లు దారి మళ్లించినట్లు ఎస్‌ఎఫ్‌ఐవో, సీబీఐ గుర్తించాయి.
2019లో సీబీఐ ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేసింది. నిధులను విదేశాలకు మళ్లించారని 2020లో దాఖలు చేసిన ఛార్జిషీటులో సైతం సీబీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈడీ తనిఖీలు చేపట్టి కేసు దర్యాప్తు వేగవంతం చేసింది. గత కొన్నేళ్లుగా ఆరోపణలు ఎదుర్కోగా, సీబీఐ విచారణతో కేసు మరో మలుపు తిరిగింది. చివరికి ఈడీ పరిధిలోకి రాగా, ఎంపీ నామాను విచారణ చేయడానికి ఆదేశాలు జారీ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook