దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఒక్కొక్కరి చుట్టూ ఉచ్చు బిగుసుకుపోతోంది. ఓ వైపు సీబీఐ మరోవైపు ఈడీ దర్యాప్తులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు చేస్తున్న విచారణ ఇంకా కొలిక్కి రాలేదు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు దేశంలో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మరో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌లు అరెస్టయ్యారు. మనీష్ సిసోడియాను సీబీఐతో పాటు ఈడీ కూడా ఆరెస్టు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారం ముడిపడి ఉందనే ఆరోపణలున్నాయి. సౌత్ గ్రూప్ ద్వారా ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి మద్యం పాలసీ విషయమై 100 కోట్లు ముడుపులు అందాయనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయమై ఇప్పటికే సీబీఐ ఎమ్మెల్సీ కవితను విచారించింది. తాజాగా కవిత ప్రతినిధిగా చెబుతున్న హైదరాబాద్ వ్యాపారవేత్త రామచంద్రన్ పిళ్లైను ఈడీ అరెస్టు చేసింది. పిళ్లై రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరు ప్రస్తావించిన తరువాత కవితను విచారణకు రావల్సిందిగా నోటీసులిచ్చింది.
వాస్తవానికి ఎమ్మెల్సీ కవిత మార్చ్ 9వ తేదీనే ఈడీ విచారణ ఎదుర్కోవల్సి ఉంది. కానీ ఢిల్లీలో మార్చ్ 10వ తేదీన ఆమె చేపట్టిన దీక్ష కారణంగా హాజరుకాలేనని 11వ తేదీన వస్తానని చెప్పడంతో ఈడీ అంగీకరించింది. ఇందులో భాగంగా ఇవాళ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 8 గంటల నుంచి కవితను ఈడీ వివిధ కోణాల్లో ప్రశ్నిస్తోంది. విచారణ ముగిసిన తరువాత కచ్చితంగా కవితను ఈ కేసులో ఈడీ అరెస్టు చేస్తుందనే వాదన విన్పిస్తోంది. ఈ క్రమంలో ఈడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటైంది. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
Also read: MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్ర ఏంటి..? అరెస్ట్‌కు రంగం సిద్ధం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook