Ex CM KCR: మాజీ హోంమంత్రి ఎక్కడ..?.. దట్టి కట్టుకోకుండానే అసెంబ్లీకి బయలు దేరిన గులాబీ దళపతి.. వీడియో వైరల్..

Telanana assembly session: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హజరవ్వడానికి మాజీ సీఎం కేసీఆర్ నందినగర్ లోని తన ఇంటి నుంచి బయలుదేరారు. ఈ నేపథ్యంలో చేతికి దట్టి కట్టుకోకుండానే ఆయన అసెంబ్లీకి వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 25, 2024, 12:44 PM IST
  • దట్టి లేకుండానే అసెంబ్లీకి గులాబీబాస్..
  • ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు..
Ex CM KCR: మాజీ హోంమంత్రి ఎక్కడ..?.. దట్టి కట్టుకోకుండానే అసెంబ్లీకి బయలు దేరిన గులాబీ దళపతి.. వీడియో వైరల్..

Ex cm kcr attending telangna budget session without wearing datti: తెలంగాణలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఈరోజు (జులై 25) న కాంగ్రెస్ ప్రభుత్వం  2024-25 కు గానుబడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ ఇటీవల తెలంగాణలో భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ ప్రభుత్వం.. పదేళ్లపాటు తెలంగాణలో  ప్రజల్ని మోసం చేసిందని, అక్రమాలకు పాల్పడిందని కూడా  కాంగ్రెస్ విమర్శిస్తున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తరచుగా.. అనేక సెంటిమెంట్ లను ఫాలో అయ్యేవారు.

 

ముఖ్యంగా కేసీఆర్ రాజశ్యామల యాగాలను ఎక్కువగా చేసేవారు. అదే విధంగా గతంలో ఉన్న పాత సచివాలయం భవనాన్ని కూలగొట్టేసి, దాని స్థానంలో కొత్త సచివాలయం భవనాన్ని కూడా  కట్టించారు. కేసీఆర్ తరచుగా ఏ సమావేశానికి వెళ్లిన, ఏ కార్యక్రమాలకువెళ్లిన, పబ్లిక్ మీటింగ్ లకు వెళ్లిన కూడా చేతికి తప్పనిసరిగా దట్టికట్టుకుని వెళ్లేవారు. మాజీ హోంమంత్రి మహమూద్ అలీ తప్పనిసరిగా కేసీఆర్ చేతికి దట్టికట్టేవారు. దీన్ని కేసీఆర్ ఎంతో సెంటిమెంట్ గా భావించేవారు. కానీ తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ వెళ్తున్న వేళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో మాజీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు.

కానీ మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో మహమూద్ అలీ ఎక్కడ కన్పించలేదు. అంతేకాకుండా.. కేసీఆర్ దట్టిలేకుండానే  అసెంబ్లీకి బయలుదేరారు. దీంతో ఈ ఘటన కాస్త ప్రస్తుతం రాజకీయాల్లోను, అటు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు కూడా సెంటిమెంట్ లకు పెద్దపీట వేసు గులాబీబాస్ .. ఇలా దట్టిలేకుండానే వెళ్లడం వెనుక కూడా ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. అంతేకాకుండా.. అసలు మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హజరు కారని కూడా చాలా మంది భావించారు.

కానీ అందరి అంచనాలు తలకిందులు చేసే విధంగా గులాబీబాస్ అసెంబ్లీకి హజరవ్వడానికి బయలుదేరారు. కాగా, అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడీగా చర్చలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ కేటీఆర్, హరీష్ రావు ఆమరణ ప్రొటెస్ట్ చేయాలనే చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.. అంతేకాకుండా.. కాంగ్రెస్ నేతలు ఇటీవల కేసీఆర్ సభకు హజరైతేనే సభ రంజుగా ఉంటుందని వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్ గా కేటీఆర్.. కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి తాము చాలని, గులాబీ బాస్ దాక ఎందుకంటూ కూడా సెటైర్ లు వేశారు.

Read more: Teen stalker: ఆన్‌లైన్‌ డెలివరీ బుకింగ్స్‌ చేస్తూ ట్యూషన్‌ టీచర్‌కు వేధింపులు.. అసలు విషయం తెలిసి ఖంగుతిన్న పోలీసులు..

ఇటీవల బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, వరుసగా క్యూలు కట్టినట్లు కాంగ్రెస్ లోకి చేరిపోతున్నారు.దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. టీఆర్ఎస్ ఆవిర్భవించినప్పుడు ఇంతకన్న  ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇవి తమ విశ్వాసాన్ని తగ్గించలేవని గులాబీబాస్ తెల్చిచెప్పారు. కానీ ప్రస్తుతం కేసీఆర్ దట్టిలేకుండా బడ్జెట్ సమావేశాలకు హజరవ్వడం మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News