Gas Cylinder Blast : హైదరాబాద్ లో శివారులో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..

Gas Cylinder Blast: హైదరాబాద్ లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 11, 2024, 05:24 PM IST
  • - నగర శివారులో భారీ అగ్ని ప్రమాదం..
    - భారీగా ఎగిసిపడుతున్న మంటలు..
Gas Cylinder Blast : హైదరాబాద్ లో  శివారులో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..

Abudullapurmet Gas Cylinder Blast: భాగ్య నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆదివారం రోజు  అబ్దుల్లాపూర్ మెట్ మండలం.. అనాజ్ పూర్ గ్రామంలో ఒక భవనంలోని గ్యాస్ సిలెండర్ పేలింది. పేలుడు ధాటికి మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఇంట్లోని రిఫ్రిజిరేటర్ కూడా పేలినట్లు తెలుస్తొంది. ఒక్కసారిగా భారీగా శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు భయంతో ఇంటి నుంచి బయటకు పరుగులు పెట్టారు. స్థానికులు సమాచారం మేరకు.. ఫైర్ సిబ్బంది, పోలీసులు  ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

అగ్ని ప్రమాద ఘటన జరిగినప్పుడు ఇంట్లో ఒక పెద్దావిడ మాత్రమే ఉన్నట్లు తెలుస్తొంది. ఆమెను స్థానికులు జాగ్రత్తగా బైటకు తీసుకెళ్లారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు, స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనతో కాలనీ వాసులంతా ఒక్కసారిగా భయాందోళనలతో ఆ ప్రాంతంనుంచి దూరంగా వెళ్లిపోయారు. 

Read More:Priyamani - Bhamakalapam 2: ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోన్న 'భామా కలాపం 2' ట్రైలర్.. ఫిబ్రవరి 16న ఆహాలో స్ట్రీమింగ్..

Read More: Gastric Problem: ఇవి తీసుకుంటే గ్యాస్‌ సమస్య ఉండదు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News