హైదరాబాద్: ఖైరతాబాద్‌లోని రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ( ఆర్టీఏ) కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రికార్డు రూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఉద్యోగులు బయటికి పరుగులు పెట్టారు. స్థానికుల కథనం ప్రకారం ఉదయం 10 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలిసింది. విద్యుత్ షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. కాగా ఫైర్ సిబ్బంది రంగ ప్రవేశంతో మంటలు అదపులోకి వచ్చాయి. దీంతో ఉద్యోగులు, చుట్టుపక్కల వారు ఊపిరి పీల్చుకున్నారు.
వారం రోజుల్లో రెండోస్సారీ..
వారం రోజుల వ్యవధిలో ఆర్టీఏ కార్యాలయం అగ్నిప్రమాదం జరగడం ఇది రెండో సారి. రికార్డు రూంలో జరిగిన ఈ అగ్నిప్రమాదంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై లోతైన దర్యాప్తు చేపట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.