Siddipeta: సిద్దిపేటలో కాల్పుల కలకలం... రూ. 43 లక్షలు దోచుకెళ్లిన దుండగులు..

Siddipeta: సిద్దిపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద కాల్పుల కలకలం రేపింది. ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి.. రూ. 43 లక్షలను దుండగులు దోచుకెళ్లారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 31, 2022, 04:09 PM IST
  • సిద్దిపేటలో కాల్పుల కలకలం
  • తుపాకీతో బెదిరించి రూ.43 లక్షలు కొట్టేశారు
Siddipeta: సిద్దిపేటలో కాల్పుల కలకలం... రూ. 43 లక్షలు దోచుకెళ్లిన దుండగులు..

Siddipeta Robbery: సిద్దిపేటలో కాల్పుల (Firing) కలకలం రేగింది. సబ్‌రిజిస్ట్రార్‌  కార్యాలయం వద్ద తుపాకీతో కాల్పులు జరిపి.. రూ. 43 లక్షలను దుండగులు దోచుకెళ్లారు.

వివరాల్లోకి వెళితే...

భూమి రిజిస్ట్రేషన్ (Land registration) చేసుకోవడానికి సిద్దిపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చాడు నరసయ్య. తనతోపాటు రూ.43 లక్షల నగదును తీసుకొచ్చాడు. కారు డ్రైవర్ పరుశురామ్ కు డబ్బును చూసుకోమని చెప్పి..కార్యాలయం లోపలికి వెళ్లాడు. అనంతరం ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి..కారు డ్రైవర్ వైపు ఉన్న అద్దాన్ని పగులగొట్టారు. దీంతో డ్రైవర్ కారును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయగా..అతడిపై దుండగలు కాల్పులు జరిపి...నగదును దోచుకెళ్లారు. డ్రైవర్ పరుశురామ్ గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి  తరలించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్నారు. నరసయ్య భూ రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఏదైనా వివాదాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Also Read: KTR: క్యూట్ బట్ సీరియస్... ఏడేళ్ల బాలుడి కంప్లైంట్‌పై కేటీఆర్ క్విక్ రియాక్షన్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News