Robbers Return Awards: దొంగలు కూడా మనుషులే. వారిలో కూడా మానవత్వం ఉంటది. అలా మంచి మనసున్న దొంగలు ఓ సినిమా దర్శకుడి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. అయితే ఆ దర్శకుడికి వచ్చిన అవార్డులు, మెడల్స్ ఎత్తుకెళ్లిన విషయాన్ని గుర్తించి మళ్లీ వాటిని తిరిగిచ్చి ఆదర్శంగా నిలిచారు.
Don't Shoot Me In Encounter: పోలీసుల వద్దకు వచ్చి లొంగిపోకుండా .. పోలీసులే తమని వెదుక్కుంటూ వస్తే కచ్చితంగా ఎన్కౌంటర్ చేసి పారేస్తారు అనే భయం పుట్టించడంలో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు సక్సెస్ అయ్యారు అని చెప్పేందుకు నిదర్శనంగా తాజాగా యూపీలో ఒక ఘటన చోటుచేసుకుంది.
Robbery Batch Attacks:ఢిల్లీ, సరైకలే ఖావ్, నొయిడాలను అనుసంధానం చేస్తూ నిర్మించిన 1.5 కిమీ పొడవైన సొరంగమార్గంలో ఈ ఘటన జరిగింది. దోపిడీ దొంగలు రెండు బైకులపై వచ్చి కారును అడ్డుకోవడం.. అందులో ఒకరు తుపాకీ చూపించి డ్రైవర్ ని బెదిరిస్తుండగా.. మరొకడు వెనుక సీటులో కూర్చున్న వ్యక్తి నుంచి క్యాష్ బ్యాగు దోచుకోవడం టన్నెల్లో ఏర్పాటు చేసిన సెక్యురిటీ కెమెరాల్లో రికార్డయింది.
Thief Ran Into Glass: స్టోర్‌లోకి ప్రవేశించి డిస్ ప్లేలో ఏర్పాటు చేసిన 18 వేల డాలర్ల విలువైన హ్యాండ్ బ్యాగ్స్ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన ఓ దొంగ ఊహించని విధంగా సెక్యురిటీకి దొరికిపోయాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ చోరీ దృశ్యం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
Saibaba Temple Robbery : హైద్రాబాద్ శివారు ప్రాంతంలోని అబ్దుల్లాపుర్ మెట్లో సాయి బాబా ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. ఈ విషయాన్ని గ్రహించిన ఆలయ పూజారి..వెంటనే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
Thieves steal Rs 25 lakh in Warangal : కారులో ఉన్న25లక్షల రూపాయల నగదును దొంగలు అపహరించుకొని వెళ్లారు. ప్రకాశ్‌రెడ్డిపేటకు చెందిన కొండబత్తుల తిరుపతి తన ఇద్దరు కుమారులతో కలిసి హంటర్‌రోడ్డులోని ఒక బ్యాంకుకు వెళ్లాడు. తన చిన్నకుమారుడు కృష్ణవంశీ తన ఖాతా నుంచి 5లక్షలు రూపాయలు డ్రా చేసి తండ్రికి ఇచ్చి వెళ్లి పోయాడు.
తెలంగాణ హైదరాబాద్ (Hyderabad) పరిసర ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో చోరీ (Theft) కేసులు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి నివాసం(Renuka Chowdhury) లో చోరీ జరిగింది.
ఢిల్లీలో ఈ మధ్యకాలంలో ఓ గ్యాంగ్ కొత్త రకం దొంగతనాలకు పాల్పడుతోంది. పథకం ప్రకారం పిజ్జాలను ఆన్ లైన్ ద్వారా ఆర్డర్ చేసి.. వాటిని పట్టుకొచ్చే డెలివరీ బాయ్స్‌పై దాడులకు పాల్పడడానికి శ్రీకారం చుట్టింది ఓ ముఠా.
హర్యానాలోని అంబాలా ప్రాంతానికి చెందిన ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కి గూగుల్ సంస్థలో జాబ్ చేయాలని కోరిక. ఎన్నో ఇంటర్వ్యూల తర్వాత ఆఖరికి ఆ సంస్థలో ఉద్యోగం దొరకడంతో ఆయన ఆనందానికే హద్దులు లేకుండా పోయింది. లక్షల జీతం వచ్చే ఉద్యోగంలో చేరాక.. ఓ గర్ల్ ఫ్రెండ్ కూడా పరిచయమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.