Krishna River Management Board: తెలంగాణకు ప్రాణప్రదమైనవి నీళ్లు అని.. రాజకీయాలు మాట్లాడాల్సిన టైమ్‌లో మాట్లాడతామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారబోతున్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని హితవు పలికారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కటవుదామని.. ఎన్నికలపుడు రాజకీయాలు మాట్లాడుకుందామన్నారు. ఉమ్మడి సాగు నీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి అనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని.. ఉమ్మడి ప్రాజెక్టులు krmb పరిధిలోకి వారం రోజుల్లోగా వెళతాయని నిన్న ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయమైనట్లుగా తెలుస్తోందన్నారు. ఇదే జరిగితే ఏపీకి లాభం.. తెలంగాణకు నష్టం జరుగుతుందన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
"జూలై 2021లోనే కేంద్రం krmb (Krishna River Management Board) పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తేవాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను కేసీఆర్ నాడు గట్టిగా వ్యతిరేకించారు. మేము ఆనాడు కొన్ని షరతులు పెట్టాం.. వాటిని ఇంకా కేంద్రం ఒప్పుకోలేదు. కృష్ణా జలాల్లో ఇంకా తెలంగాణ వాటా తేలినపుడు krmb పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను ఎలా తెస్తారు..? కృష్ణా నీటిని ఏపీకి 50 శాతం తెలంగాణకు 50 శాతం పంపిణీ చేయాలని కూడా షరతు పెట్టాం.. శ్రీశైలం నుంచి జల విద్యుత్ ఉత్పత్తి చేసి 264 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేయాలని మరో షరతు పెట్టాం..
ఏకపక్షంగా krmb పై నిర్ణయం తీసుకోకుండా అపెక్స్ కమిటీ వేయాలని మేము ఆనాడే కోరాం.. ఒక సంవత్సరంలో వాడుకోని నీటిని మరో సంవత్సరం వాడుకునేలా వెసలు బాటు కనిపించాలని కేంద్రాన్ని నాడు కోరాం.. ఆపరేషన్ మాన్యువల్ రూపొందించకుండా krmb పరిధిలోకి తెస్తారు..? ప్రస్తుత ప్రభుత్వం గుడ్డిగా krmb ఏర్పాటుకు ఒప్పుకున్నదని వార్తలు వస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కేంద్రం ఇవ్వమంటే ఒప్పుకున్నట్టే krmbకి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది. ఇది ఏపీ సీఎం జగన్ విజయం అన్నట్టుగా పత్రికలు రాస్తున్నాయి.
krmb పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను తెస్తే జల విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. దాదాపు 5 వేల మిలియన్ యూనిట్ల జల విద్యుత్‌ను మనం కోల్పోతాం.. krmb చేతిలో ప్రాజెక్టులు పెడితే మనకు ఇష్టం ఉన్నపుడు విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉండద. krmbకి దరఖాస్తు పెట్టి వాళ్ళు అనుమతించేలోపు గ్రిడ్ కుప్ప కూలుతుంది. జల విద్యుత్‌ను కొన్ని సెకన్లలోనే ఉత్పత్తీ చేసుకోవచ్చు. అదే థర్మల్ విద్యుత్ ఉత్పత్తి మొదలు కావడానికి తొమ్మిది గంటలు పడుతుంది. టెయిల్ పాండ్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తికి కూడా వీలు పడదు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై కూడా krmb ప్రభావం ఉంటుంది.. krmb లో ఉమ్మడి ప్రాజెక్టులు చేరిస్తే తెలంగాణకు ఆత్మహత్యా సదృశ్యమే.." అని హరీష్ రావు అన్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలని అన్నారు మాజీ మంత్రి. రాజకీయం మాని రాష్ట్రానికి జరిగే నష్టం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలన్నారు. రాష్ట్రం స్పందించకుంటే బీఆర్ఎస్ పోరాటం చేయక తప్పదన్నారు. ఎప్పటికైనా తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడేది గులాబీ జెండానే.. సీలేరు ప్రాజెక్టును కాంగ్రెస్ బీజేపీలు ఒక్కటై తెలంగాణకు దక్కకుండా చేశాయన్నారు. ఇపుడు కూడా తెలంగాణకు ఆ రెండు పార్టీ లు ద్రోహం చేస్తున్నాయన్నారు. తమ మీద బురద జల్లడం కాదని.. కాళేశ్వరంపై రోజుకో లీకు ఫేక్ వార్తను ప్రభుత్వం సృష్టిస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం.. వాటి కోసం బీఆర్ఎస్ ఎంతకైనా తెగిస్తుందన్నారు.
Also Read: Lord Sri Ram Idol: అయోధ్య విగ్రహం.. రామయ్య నీరూపం చూడడానికి రెండు కళ్లు చాలవయ్యా
Also Read: Ram Mandir: అయోధ్యకు ప్రభాస్ 50 కోట్ల విరాళం…క్లారిటీ ఇచ్చిన టీమ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter